India Maximum Temperature: నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్ - నంద్యాలలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
Maximum Temperature in Nandyal: దేశంలో శుక్రవారం నాడు అత్యధిక ఉష్ణోగ్రత ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో నమోదైంది. మే 3న నంద్యాలలో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
హైదరాబాద్: వేసవి కాలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భానుడి ప్రతాపానికి కొన్నిచోట్ల ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడుతుంటే, మరికొన్ని చోట్ల వడదెబ్బతో ప్రాణాలు పోతున్న ఘటనలు చూస్తున్నాం. శుక్రవారం నాడు దేశంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఏపీ, తెలంగాణలో 43-46 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఏపీలోని నంద్యాలలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 46.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 46 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి.
Today, maximum temperatures are in the range of 43-46°C in many parts of Rayalaseema and Telangana; in some parts of Odisha; in isolated pockets of Vidarbha, Madhya Maharashtra and Coastal Andhra Pradesh; in the range of 40-43°C in over many parts of Gangetic West Bengal, 1/3 pic.twitter.com/ZiTYn9X7sq
— India Meteorological Department (@Indiametdept) May 3, 2024
ఆంధ్రప్రదేశ్ - గరిష్ట ఉష్ణోగ్రతలు
నంద్యాల - 46.3 డిగ్రీలు
కడప - 46.2 డిగ్రీలు
కర్నూలు - 45.9 డిగ్రీలు
రెంటచింతల - 45.2 డిగ్రీలు
అనంతపురం - 44.4 డిగ్రీలు
తిరుపతి - 43.6 డిగ్రీలు
నెల్లూరు - 43.6 డిగ్రీలు
నందిగామ - 43.1 డిగ్రీలు
తెలంగాణ - గరిష్ట ఉష్ణోగ్రతలు
ఖమ్మం - 45 డిగ్రీలు
మహబూబ్ నగర్ - 44.5 డిగ్రీలు
నిజామాబాద్ - 44.3 డిగ్రీలు
రామగుండం - 44.2 డిగ్రీలు
కొత్తగూడెం - 44 డిగ్రీలు
హైదరాబాద్ - 43.6 డిగ్రీలు
పశ్చిమ బెంగాల్ - గరిష్ట ఉష్ణోగ్రతలు
కలైకుండ - 44.6 డిగ్రీలు
పనాగఢ్ - 42.5 డిగ్రీలు
సూరి - 42 డిగ్రీలు
ఝార్‌గ్రామ్ - 42 డిగ్రీలు
ఒడిశా - గరిష్ట ఉష్ణోగ్రతలు
బౌధ్ - 44.6 డిగ్రీలు
తిత్లిలాగఢ్ - 44 డిగ్రీలు
నువాపడ - 43.9 డిగ్రీలు
బోలంగీర్ - 43.4 డిగ్రీలు
మల్కన్‌గిరి - 43.3 డిగ్రీలు
తమిళనాడు - గరిష్ట ఉష్ణోగ్రతలు
ఇరోడ్ - 43.4 డిగ్రీలు
కరూర్ పారామతి - 42.5 డిగ్రీలు