Praveen Prakash VRS: ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ సంచలన నిర్ణయం, వీఆర్ఎస్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Andhra Pradesh News | ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తన రాజీనామా లేఖను జూన్ నెలలో పంపగా, మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
IAS Praveen Prakash voluntary retirement | అమరావతి: సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఎస్ (Voluntary Retirement) తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వానికి జూన్ 25న లేఖ రాశారు. ఆయన వీఆర్ఎస్ లేఖను ఏపీ ప్రభుత్వం మంగళవారం (జులై 9న) ఆమోదించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సెప్టెంబర్ 30, 2024 నుంచి తన వీఆర్ఎస్ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. 1994 ఏపీ ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐఏఎస్ రూల్ 16లోని సబ్-రూల్ (2)లోని నిబంధనల ప్రకారం స్వచ్ఛంద పదవీ విరమణ నోటీసును ఏపీ ప్రభుత్వానికి ప్రవీణ్ ప్రకాష్ సమర్పించారు. ప్రభుత్వం ఆమోదం తెలపడంతో తాజాగా ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్‌పై గెజిట్ విడుదల చేశారు.
ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేయడంతో వీఆర్ఎస్ నిర్ణయం
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థానం నుంచి ప్రవీణ్ ప్రకాష్ ను ఏపీ ప్రభుత్వం గత నెలలో బదిలీ చేసింది. దాంతో ఆయన వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నారు. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో కోన శశిధర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే వైసీపీ హయాంలో తాను అధికార పక్షంతో అంటకాగినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రవీణ్ ప్రకాష్ స్పందించారు. తాను ఎవరినీ లక్ష్యంగా చేసుకుని పనిచేయలేదని, పాఠశాల విద్యాశాఖలో తాను కావాలని ఎవర్నీ అవమానించలేదని ఓ వీడియో విడుదల చేయడం తెలిసిందే. తాను ఎవరినైనా టార్గెట్ చేశానని అనిపిస్తే తనను క్షమించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నానన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బందిని తాను తనిఖీల పేరుతో అవమానించాను అనే వదంతుల్లో వాస్తవం లేదన్నారు. విద్యా శాఖలో, విద్యా వ్యవస్థలో మార్పు కోసం, మెరుగైన వ్యవస్థ కోసం మాత్రమే పని చేశానని సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు.
ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ ఆమోదించిన ఏపీ ప్రభుత్వం
GOVERNMENT OF ANDHRA PRADESH
IAS Sri Praveen Prakash, IAS (AP:1994) Voluntary Retirement from Indian Administrative Service- Notified
GENERAL ADMINISTRATION (SC.A) DEPARTMENT
Dated: 09-07-2024.
G.O. RT. No.1207
From Sri Praveen Prakash, IAS (AP:1994), letter, Dated:25.06.2024.
ORDER:
In the letter read above, Sri Praveen Prakash, IAS (AP:1994), has submitted notice for voluntary retirement from the Indian Administrative Service, effective from 30.09.2024, as per the provisions of sub-rule (2) of Rule 16 of the All India Service (Death-cum-Retirement Benefits) Rules, 1958 on personal grounds.
2. The State Government after careful consideration of the request, decided to permit Sri Praveen Prakash, IAS (AP:1994), to retire voluntarily from Indian Administrative Service with effect from 30.09.2024 A.N., on personal grounds as per the provisions under Sub-rule (2) of Rule 16 of the All India Services (Death-cum-Retirement Benefits) Rules, 1958.
3. The following notification shall, accordingly, be published in the extraordinary issue of Andhra Pradesh Gazette:
NOTIFICATION
Under Sub-rule (2) of Rule 16 of the All India Services (Death-cum-Retirement Benefits) Rules, 1958, Government hereby accept the request of Sri Praveen Prakash, IAS (AP:1994) to retire voluntarily from Indian Administrative Service with effect from 30.09.2024 ΑΝ.
(BY ORDER AND IN THE NAME OF THE GOVENOR OF ANDHRA PRADESH)