అన్వేషించండి

GVL Cow kick : ఎంపీ జీవీఎల్ పై కాలు విసిరిన ఆవు, వీడియో వైరల్!

GVL Cow kick : ఎంపీ జీవీఎల్ కు గుంటూరులో చేదు అనుభవం ఎదురైంది. ఆవుకు నమస్కరించేందుకు దగ్గరకు వెళ్లిన జీవీఎల్ ను ఆవు తన్నింది.

GVL Cow kick : బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు మిర్చియార్డులో  ఆవు దాడి నుంచి జీవీఎల్ తృటిలో బయటపడ్డారు.  బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. గుంటూరు మిర్చియార్డులో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్కడున్న గోశాలలోని ఆవును తాకి నమస్కరించేందుకు జీవీఎల్ వెళ్లారు. అయితే ఆవు జీవీఎల్ ను కాలితో తన్నింది. అయితే తేరుకున్న జీవీఎల్‌ మరోసారి ఆవు వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆవు మళ్లీ కాలితో తన్నింది. అప్రమత్తమైన ఆయన వెనక్కి తప్పుకున్నారు. తర్వాత నిర్వాహకులు ఆవును పట్టుకుని జీవీఎల్‌ను రమ్మని కోరగా ఆయన దూరం నుంచే నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన వైరల్ అయింది. జీవీఎల్ పై ఆవు దాడి చేసిందని వార్తలు వచ్చాయి. దీనిపై జీవీఎల్ స్పందించారు. ఆవు బెదిరి అలా చేసిందని కొందరు దానిని దాడిగా అభివర్ణించారన్నారు.  

దాడి కాదని జీవీఎల్ వివరణ

గుంటూరు మార్కెట్ యార్డు ఘటనపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. అది చాలా చిన్న సంఘటన అన్నారు. గుంపుగా వెళ్లిన తమను చూసి ఆవు భయపడి కాలు విసిరిందన్నారు. ఆవు కాలు విసిరి తన కుర్తాను పాడు చేసిందని వివరించారు. ఈ ఘటనను పొరపాటున దాడిగా అభివర్ణిస్తున్నారన్నారు. తనను నిందించినా పర్లేదు కానీ దయచేసి పవిత్రమైన ఆవును నిందించవద్దన్నారు. శనివారం గుంటూరు మిర్చి ఎగుమతి దారుల అసోసియేషన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో జీవీఎల్ పాల్గొన్నారు. అక్కడ ఉన్న ఆవుకు దణ్ణం పెట్టేందుకు జీవీఎల్ వెళ్లగా ఆవు ఎగిరి తన్నబోయింది. వెంటనే అప్రమత్తమైన ఆయన పక్కకు జరిగారు. రెండోసారి దణ్ణం పెట్టుకునేందుకు జీవీఎల్ ప్రయత్నించినా ఆవు తన్నబోవడంతో దూరం నుంచే దణ్ణం పెట్టుకుని వెళ్లిపోయారు. జీవీఎల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పోస్టు చేస్తూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. వీడియోను మార్ఫింగ్ చేసి పోస్టు చేస్తున్నారు. 

మధ్యప్రదేశ్‌లో మరో ఘటన..

వైద్య రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా..ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా..కనీస వసతుల విషయంలో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉన్నాయి. ఎన్ని దుర్ఘటనలు జరిగినా..ఎన్ని ప్రాణాలు పోయినా..నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. అందుకే... గవర్నమెంట్ హాస్పిటల్ అంటే జనాలు అంతగా భయపడిపోతున్నారు. కొన్ని చోట్ల కాస్తో కూస్తో వసతులు మెరుగు పడినా...ఇంకా కొన్ని చోట్ల మాత్రం సమస్యలు తీరటం లేదు. "హాస్పిటల్‌కు వెళ్తే ఉన్న రోగం పోవడమేమో కానీ..కొత్త రోగాలు వచ్చేలా ఉన్నాయి" అని కొందరు అసహనం వ్యక్తం చేస్తుంటారు. అలా ఉంటుంది...ఆ ఆసుపత్రుల నిర్వహణ. అప్పుడప్పుడూ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గర్‌లో జిల్లా ఆసుపత్రిలో షాకింగ్ సంఘటన జరిగింది. ఓ ఆవు ఏకంగా ICU వార్డ్‌లోకి వెళ్లింది. అక్కడి మెడికల్ వేస్ట్‌ని తింటూ కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ...ఆవు అలా లోపలకు వచ్చి తిరగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆవులు ఇలా లోపలకు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఇద్దరిని నియమించుకున్నారు. అయినా...ఆవు లోపలకు వచ్చేసింది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆవు ICU వార్డ్‌లో మెడికల్ వేస్ట్ తింటుండడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే...హాస్పిటల్‌లోని సెక్యూరిటీ గార్డ్‌తో పాటు ఇద్దరు సిబ్బందిని తొలగించారు.

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget