(Source: ECI/ABP News/ABP Majha)
Janasena Target Dwarampudi : ద్వారంపూడిని రౌండప్ చేస్తున్న జనసేన - సీఐడీకి రేషన్ బియ్యం అక్రమాల కేసు
Kakinada : కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలను మంత్రి నాదెండ్ల బయటకు తీస్తున్నారు. ఆయన రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆఫ్రికాకు స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
Minister Nadendla : ద్వారంపూడి.. నీ అవినీతి అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చకపోతే నాపేరు పవన్ కల్యాణ్ కాదు.. అని జనసేనాని కాకినాడ నడిబొడ్డు నుంచి సవాల్ చేశారు. ఇప్పుడు దాన్ని నిజం ేచసి చూపిస్తున్నారు. రేషన్ ద్వారా పేదలకు ఇచ్చే చౌక బియ్యం పక్కదారిపడుతుందని, . ఈ మాఫియాకు కాకినాడ కేరాఫ్ అడ్రస్ గా ఉందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి వెనుకుండి నడిపిస్తోంది కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అంటూ పవన్ కల్యాణ్‌తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బహిరంగంగానే ఆరోపించారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పౌరసరఫరాల శాఖను జనసేన తీసుకోవడం, జనసేనలో కీలక నేత నాదెండ్ల మనోహర్ చేతికి అప్పగించడం.. వెనువెంటనే ఆయన కాకినాడలోనే తిష్టవేసి మరీ అక్రమంగా నిల్వ చేసిన బియ్యం గొడౌన్లపై వరుస దాడులు చేయిస్తున్నారు.
బియ్యం అక్రమాల కేసు సీఐడీకి అప్పగింత
కాకినాడ కేంద్రంగా పీడీఎస్ బియ్యం అక్రమాల పుట్టను ప్రభుత్వం కదుపుతోంది. ధాన్యం కొనుగోళ్లు నుంచి మిల్లర్లు ఎగుమతులు వరుకు పీడీఎస్ బియ్యం దొడ్డిదారిన సేకరించి మళ్లీ ఆ బియ్యాన్ని రీసైకిల్‌గా ఎగుమతులు చేయడం వరకు తనిఖీల్లో దొరుకుతున్న తీగ పట్టుకుని డొంకను కదిలించేందుకు మినిష్టర్ నాదెండ్ల మనోహర్ కాకినాడలో రివ్వూల నుంచి తనిఖీలు వరకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు సాఫీగా తమ పని చూసీచూడనట్లు వ్యవహరించిన సివిల్ సప్లై అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
ఆకస్మిక తనిఖీలు... బయటపడుతోన్న బాగోతాలు
సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ చేపట్టిన తనిఖీల్లో బియ్యం ఎగుమతులుకు సంబందించిన అనేక అక్రమాలు బయటపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి, అధికారుల బృందం కాకినాడ యాంకరేజి పోర్టు పరిధిలోని విశ్వప్రియ, ఎక్స్‌ఫోర్ట్స్, బీచ్‌రోడ్డులోని సార్టెక్స్ ఇండియా, మానస ఎక్స్‌పోర్ట్స్ డీఎన్‌ఎస్‌లలో శుక్రవారం మంత్రి తనిఖీలు చేపట్టారు. విశ్వప్రియ, సార్టెక్స్, లవన్, సరళ ఫుడ్స్ ఇంకా కొన్ని సంస్థలకు సంబందించిన గోడౌన్లలో పీడీఎస్ బియ్యం అక్రమాలు గుర్తించారు. కొన్నిచోట్ల అక్రమాలు లేవని అధికారులు చెబుతున్నప్పటికీ ఆధారాలను మాయం చేసే చర్యలు మాత్రం మంత్రి దృష్టిలో పడడంతో అధికారులను తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. మంత్రి, అధికారులు చేపట్టిన తనిఖీల్లో అవకతవకలు వెలుగు చూసిన గొడౌన్లలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులకు చెందినవేనని గుర్తించామని, మరిన్ని పేర్లు బయటపెడతామని ప్రకటించారు.
రెండోరోజు తనిఖీలు
మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలోనే రెండో రోజు అయిన శనివారం విస్తృత సమీక్షలు, తనిఖీలు చేపట్టారు. పీడీఎస్ బియ్యంకు సంబంధించిన అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు అధికారులను దగ్గరుండి మరీ వారినుంచి సమాచారం రప్పించి ఆపై ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే కంచే చేను మేసిన చందంగా కొందరు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని అక్రమార్కులకు చేరవేయడం ద్వారా జాగ్రత్తపడుతున్నారని, ఈ చర్యలను గుర్తించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా హెచ్చరించారన్న టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా కాకినాడ కేంద్రంగా పీడీఎస్ బియ్యం మాటున జరుగుతోన్న అక్రమాలు మాత్రం నిగ్గుతేల్చే పనిలో సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ సారధ్యంలో పడ్డారు అధికారులు..