అన్వేషించండి

Nallari Kiran Kumar Reddy : ఇంతకీ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ ? - కాంగ్రెస్‌లోనే కాదు బీజేపీలో చేరినా ఆజ్ఞాతంలోనేనా ?

Nallari : బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లో కనిపించడం లేదు. జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించినా పార్టీలో కూడా ఆయనకేమీ బాధ్యలు ఇవ్వలేదు.

Kiran Kumar Reddy not seen in active politics : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో జమిలీ ఎన్నికల వేడి పెరిగిన సమయమంలో కనిపించకుండా పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. కొన్నాళ్లకు మళ్లీ సొంత పార్టీలో చేరారు. కానీ అక్కడ ఉండలేక కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కానీ ఆయన ఎప్పుడూ యాక్టివ్ పాలిటిక్స్ లో కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల సమయంలో   సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఉపయోగపడతారని కమలం పార్టీ అంచనా వేసింది. కొన్ని సమావేశాల్లో కనిపించారు. 

కానీ విజయశాంతి వంటి నేతలు విమర్శలు చేశారు.  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో పార్టీ కార్యాలయానికి రాగానే విజయశాంతి గుర్రుగా చూశారు. సమైక్య వాది మన పార్టీలోకి రావడమేంటని జాతీయ పార్టీ మహిళ నేత కస్సుమన్నారు. ఆమె వేదికపైకి ఎక్కకుండానే వెళ్లారు. తెలంగాణ ద్రోహులను పార్టీలోకి తీసుకున్నందుకు తాను వేదికపైకి వెళ్లలేదని కూడా విజయశాంతి చెప్పారు. ఆ తర్వాత  ఆయన మరే సమవేశానికి హాజరు కాలేదు. ఇప్పుడు ఏపీ ఎన్నికలు వచ్చేసినా ఆయన ఎక్కడా కనిపించడం లేదు.  

ఇక కాంగ్రెస్ లో కొన్నేళ్లు పాటు ఉన్నా సైలెంట్ గా ఉన్న కిరణ‌్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత యాక్టివ్ అవుతారని భావించారు. అయితే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలకు బాగా పనికొస్తాడని  పార్టీలో చేర్చుకున్నారు. పైగా మాజీ ముఖ్యమంత్రి  కావడంతో ప్లస్ పాయింట్ అయింది. ఆయన పార్టీలో చేరితే రెడ్డి సామాజికవర్గం ఓటర్లు కమలం వైపు చూస్తారని భావించారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బీజేపీకి ఎలాంటి మేలు జరగలేదన్న వాదన వినపిస్తోంది. 

తెలంగాణ ఎన్నికల సమయంలో తెర వెనుక పాత్ర పోషించే ప్రయత్నం చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఆయన రాజకీయాల్లో  కనిపించడం మానేశారు.  ఏపీ బీజేపీ కార్యక్రమాల్లో అసలు పాల్గొనడం లేదు.  పార్టీలో చేరినప్పుడు  ఏపీకి వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి కనిపించి వెళ్లిపోయారు. తర్వాత బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి బాధ్యతలను చేపట్టే సమయంలో కనిపించారు.  ఇక అంతే ఆయన అడ్రస్ లేదు. హైదరాబాద్ లోనే ఉంటున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడా, అక్కాడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.  సమైక్యాంధ్ర కోసం పోరాడిన ఏపీలోనైనా ఆయన కాలు కదుపుతారునుకుంటే అది కమలనాధులకు అత్యాశే మిగిలింది. 

ప్రస్తుతం ఏపీలో పొత్తుల చర్చలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో  కీలక స్థానాల్లో తాము పోటీ చేస్తామంటూ కొంత మంది ముందుకు వస్తున్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి  పేరు మాత్రం అసలు ప్రచారంలోకి రావడం లేదు. దీంతో ఏ పార్టీలో చేరినా సైలెంట్ మోడ్ లోనే ఉంటారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.                   

టాప్ హెడ్ లైన్స్

Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget