Eluru News: 50 కిలోల కారం పొడితో స్వామికి అభిషేకం- ద్వారకాతిరుమలలో ఘటన !
Eluru News: సుమారు 50 కిలోల కారం పొడితో ప్రత్యంగిరి దేవి ఉపాసకులు శివ స్వామికి అభిషేకం నిర్వహించారు. ద్వారకాతిరుమలలో శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమo వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Eluru News: ప్రత్యంగరి దేవి ఉపాసకులు శివ స్వామికి కారంతో అభిషేకాన్ని జరిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమo వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు, స్థానికులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రత్యంగరి దేవికి పూర్ణాహుతి హోమాన్ని జరిపారు. అనంతరం శివ స్వామి ప్రత్యంగరా దేవిని ఆవాహన చేసుకుని దీపోత్సవాన్ని ప్రారంభించారు. తరువాత దేవి ఆవాహనలో ఉన్న శివ స్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు.
సుమారు 50 కేజీల కారంతో శివ స్వామిని అభిషేకించారు. హిరణ్య కశికుడిని నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి ఉద్భవించింది అని పండితులు చెబుతారు. ప్రత్యంగిరి అమ్మవారికి కారం అంటే ఎంతో ఇష్టమని.. అందుకే అమ్మవారిని ఆవాహన చేసుకున్న శివ స్వామికి కారంతో అభిషేకాలు నిర్వహస్తున్నామని చెప్పారు. ఆదివారం రాత్రి అంతా ఆశ్రమంలోనే జాగారం చేసిన భక్తులు తెల్లవారు జామును కార్తీక మాసం మూడో సోమవారం నాడు స్వామీజీకి కారం పొడితో అభిషేకాలు చేశారు.