అన్వేషించండి

ED Chargesheets On Jagan : జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ మరో 2 చార్జిషీట్లు..!

జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మరో రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. దీంతో మొత్తం ఇప్పటికి తొమ్మిది కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లయింది.


జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మరో రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. వాన్‌పిక్, లేపాక్షి కేసుల్లో ఈ చార్జిషీట్లను దాఖలు చేసింది. ఇప్పటి వరకూ ఏడు అభియోగపత్రాలను దాఖలు చేయగా.. వాటిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు దాఖలు వాటితో కలిపి మొత్తం 9 చార్జిషీట్లను ఈడీ దాఖలు చేసినట్లయింది. సీబీఐ అభియోగపత్రాల ఆధారంగా ఈడీ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. తాజాగా దాఖలు చేసిన రెండు చార్జిషీట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంటే నిందితులందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రస్‌ అల్‌ఖైమా సంయుక్త భాగస్వామ్యంతో వాడరేవు నిజాంపట్నం రేవు, పారిశ్రామిక కారిడార్‌  వాన్‌పిక్ ప్రాజెక్టును నిమ్మగడ్డ ప్రసాద్ చేపట్టారు. వాన్‌పిక్‌లో రస్‌ అల్‌ఖైమాకు 51 శాతం, నిమ్మగడ్డ ప్రసాద్‌కు 49 శాతం వాటాలున్నాయి. దీనికోసం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ ప్రభుత్వం 11వేల ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమిని కేటాయించిన తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్‌ జగన్‌ కంపెనీల్లో రూ.850 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారు. వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు రూ.7 కోట్ల విరాళాలిచ్చారు. ఇదంతా క్విడ్ ప్రో కోనేనని సీబీఐ కేసు నమోదు చేసింది. చార్జిషీటు ఆధారంగా ఈడీ కూడా  ద్రవ్య అక్రమ చలామణీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేసింది.

అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం లేపాక్షిలో బాలాజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి 2008లో లేపాక్షి నాలెడ్జి హబ్ కోసం 8844 ఎకరాలను అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది.  కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేసి లేపాక్షి హబ్‌కు కేటాయించిన భూములను వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి బాలాజీ కంపెనీ 800 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. ఆ నిధులను ఇందూ ప్రాజెక్ట్స్‌కు బదలాయించారు. ఇందూ ప్రాజెక్ట్స్ క్విడ్ ప్రో కోలో భాగంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిందని సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. దీని ఆధారంగా ఈడీ కూడా అభియోగపత్రం దాఖలు చేసింది. 

ఇటీవలే ఈడీ కేసుల విచారణ ముందు వద్దని .. సీబీఐ కేసుల విచారణ చేపట్టాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే హైకోర్టు పిటిషన్లను కొట్టి వేసింది. దీంతో ముందుగా ఈడీ కేసుల విచారణ ప్రారంభమవనుంది. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసుల్లో చార్జిషీట్ల ప్రక్రియ పూర్తయిన కేసుల్లో వాదనలు వినిపించడానికి సిద్ధం కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
AP Municipal Chairman Reservations: ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Municipal Elections 2026 Reservations: ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget