News
News
X

Mlc Elections : తూర్పుగోదావరి ఎమ్మెల్సీ వైసీపీదే, కుడుపూడి ఎన్నిక లాంఛనం!

Mlc Elections : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కుడుపూడి సూర్యనారాయణ రావు ఎన్నిక లాంఛనమే. సూర్యనారాయణకు పోటీగా పడిన మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

FOLLOW US: 
Share:

Mlc Elections : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కుడుపూడి సూర్య నారాయణ ఎన్నిక లాంఛనం అయింది. ఈ నెల 27న ఎన్నికల అధికారి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.  కుడుపూడి సూర్యనారాయణకు వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా చివరకు పోటీలో నిలివాలనుకున్న మూడు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.  అయితే అభ్యర్థులకు మద్దతుగా సంతకాలు చేయాల్సిన పదిమంది స్థానిక సంస్థల ప్రతినిధులు లేకపోవడంతో వ్యూహం బెడిసి కొట్టింది. దీంతో సూర్య సూర్యనారాయణ రావు నామినేషన్ ఏకగ్రీవంగా నిలిచింది.  స్క్రూట్నీ సమయంలో నామినేషన్ దాఖలుకు చివరి రోజు అనూహ్యంగా సూర్య నారాయణకు పోటీగా ముగ్గురు నామినేషన్ లు దాఖలు చేశారు. పి.గన్నవరానికి చెందిన అంబటి రాంబాబు ఆఖరి రోజున నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ నామినేషన్ పత్రంపై పదిమంది స్థానిక సంస్థల ప్రతినిధులు మద్దతు సంతకాలు చేస్తారు. అలా సంతకాలు చేసిన వారు స్క్రూట్నీ సమయంలో తాము సంతకాలు చేసిన వారికి ఎదురు తిరగడంతో నిబంధనలు ప్రకారం నామినేషన్ చెల్లదని తిరస్కరించడంతో సూర్యనారాయణ రావు ఎన్నిక ఇక లాంఛనంగా మారింది. అయితే సూర్యనారాయణ రావుకు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేస్తామన్న దళిత నాయకులు ఎన్నికలకు వెళ్లకుండానే వెనక్కి తగ్గారు. 

 చక్రం తిప్పిన మంత్రి విశ్వరూప్ 

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తన అనుయాయుడు చెల్లుబోయిన శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ విషయంలో మంత్రి భరోసా ఇచ్చారు. అయితే అధిష్టానం శెట్టిబలిజ వర్గ నాయకుడు సూర్యనారాయణ రావుకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అమలాపురం అల్లర్ల గొడవలు పెట్టిన కేసులకు సంబంధించి ఆ వర్గం దూరమైందన్న ఆలోచనలో ఉన్న వైసీపీ అధిష్టానం అదే వర్గానికి చెందిన సూర్యనారాయణ రావుకు ఎమ్మెల్సీ కట్టపెట్టేందుకే ప్రయత్నించింది.  ఇదిలా ఉంటే మంత్రి విశ్వరూప్ వర్గానికి చెందిన దళిత నాయకులు సూర్య నారాయణ రావును వ్యతిరేకిస్తూ పలు సమావేశాలు పెట్టారు. అధికాస్త అధిష్టానానికి చేరడంతో  మంత్రి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈసారి మీరు వ్యతిరేకిస్తే రేపు వచ్చే ఎన్నికల్లో సూర్యనారాయణ వర్గం నాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఇది రాజకీయాల్లో  సరికాదని మంత్రి విశ్వరూప్ చెప్పడంతో నాయకులు వెనక్కి తగ్గారు.  కొంతమంది అయితే మంత్రి మాటను వ్యతిరేకస్తూ నామినేషన్ వేసి తీరాలని పట్టుబట్టారు. మొత్తం మీద కుల నాయకులపై ఒత్తిళ్లతో ఎటువంటి నామినేషన్ దాఖాలు కాకపోవడంతో వైసీపీ వ్యూహం సఫలికృతం  అయింది. కుడుపూడి సూర్యనారాయణ అభ్యర్థిత్వం మొత్తం మీద ఏకగ్రీవంగా నిలిచింది. దీంతో సూర్యనారాయణ రావు ఎమ్మెల్సీ ఎన్నిక ఇక లాంఛనమే అయ్యింది. 

మంగమ్మ ఎన్నిక ఏకగ్రీవమే!

నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాక ముందే వైసీపీ ఓ విజయం నమోదు చేసుకుంది. ఎన్నికలు జరగకుండానే ఓ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఓ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఎస్‌ మంగమ్మ ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెను ఖరారు చేశారు.  అనంతపురం జిల్లాలో నిన్నటి వరకు నిన్నటి వరకు నామినేషన్లు స్వీకరించారు. వచ్చిన నామినేషన్లను స్క్రూటినీ చేశారు. వాటిలో చాలా నామినేషన్లను సరైన వివరాలు లేవని తిరస్కరించారు. అలా తిరస్కరించిన వాటిలో టీడీపీ లీడర్‌ నామినేషన్ కూడా ఉంది. సరైన వివరాలు ఇవ్వలేదన్న కారణంతో టీడీపీ అభ్యర్థి వేలూరు రంగయ్యసహా పలువురు నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల పరిశీలన తర్వాత ఒక్క మంగమ్మ నామినేషన్ మాత్రమే మిగిలింది. ఎన్నికల సంఘం చెప్పిన రూల్స్ ప్రకారం ఉన్న ఆ ఒక్క నామినేషన్‌ను మాత్రమే అధికారులు అంగీకరించారు. దీంతో పోటీగా అభ్యర్ధులు లేకపోవడంతో ఆమె ఎన్నికల లాంఛనం కానుంది. ప్రక్రియ పూర్తైన తర్వాత మంగమ్మ ఎన్నికను అధికారులు ప్రకటించనున్నారు. మరోవైపు నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడాన్ని ఆ పార్టీ లీడర్లు తప్పుబడుతున్నారు. కావాలనే అధికారులు నామినేష్లు తిరస్కరించారని ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై న్యాయస్థానాన్నిఆశ్రయిస్తామంటున్నారు టీడీపీ అభ్యర్థి రంగయ్య. 

Published at : 25 Feb 2023 03:28 PM (IST) Tags: East Godavari new Ysrcp Local body mlc seat Mlc elections Kudupudi suryanarayana

సంబంధిత కథనాలు

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి

Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి

Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం - ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ !

Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం - ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ !

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

టాప్ స్టోరీస్

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్