Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా
Rains In AP: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం కదలిక మెళ్లగా ఉండటం వల్ల వర్షాలు మొదట తమిళనాడులో ప్రారంభం అవుతాయి.
Weather Updates: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్ప పీడనం ఉత్తర తమిళనడు వైపుగా కదులుతోంది, దీని ప్రభావం ఏపీలో మార్చి 4 అర్ధరాత్రి నుంచి మొదలవుతుంది. తీరం వెంట 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నైరుతి నుంచి 70 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తమిళనాడు, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడనం ఎఫెక్ట్, ఆగ్నేయ గాలుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండ నుంచి కాస్తంత ఉపశమనం ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలుల ప్రభావం కాస్త తగ్గుతుంది. రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మత్స్యకారులకు సైతం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంట దక్షిణ దిశ నుంచి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా చిరు జల్లులు పడే అవకాశం ఉంది. జంగమేశ్వరపురం, బాపట్లలో, నందిగామలో, అమరావతిలో, తునిలో, విశాఖపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం కదలిక మెళ్లగా ఉండటం వల్ల వర్షాలు మొదట తమిళనాడులో ప్రారంభం అవుతాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో నేడు వాతావరణం చల్లగా మారుతుంది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం. మార్చి 6, 7, 8 న వర్షం ప్రభాం అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే మార్చి నెలలో ఏ తుఫాను ఏర్పడ్డా ప్రభావం తక్కువగానే ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఏపీ సరిహద్దులోని తమిళనాడు ప్రాంతాల్లో అల్ప పీడన ప్రభావం అధికంగా ఉంటుంది. మరో 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఉష్ణోగ్రత కొంత మేర తగ్గుతుంది.
Daily weather report for Andhra Pradesh dated 03.03.2022 pic.twitter.com/xFyGNrhyGa
— MC Amaravati (@AmaravatiMc) March 3, 2022
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయి. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రిపూట చలి ప్రభావం తగ్గడం లేదు. నేడు వాతావరణం పొడిగా ఉంటూ, గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అల్పపీడనం ఏపీ తీరాన్ని నేటి రాత్రి తాకే అవకాశం ఉంది. ఆలస్యంగా కదలికలతో మరో రెండు రోజుల్లో తెలంగాణలో చిరు జల్లులు కురవనున్నాయి.
Also Read: Gold Rate Today: గుడ్‌న్యూస్, మళ్లీ పతనమైన బంగారం ధర, కొండెక్కుతోన్న వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ