Vijayawada News : డాక్టర్ లోకేష్‌ను వదిలి పెట్టిన పోలీసులు - గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏం జరిగిందంటే ?
Andhra News : గన్నవరం ఎయిర్ పోర్టులో డాక్టర్ లోకేష్ అనే ఎన్నారైను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే ?
Andhra Politics : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో శుక్రవారం రాత్రి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి లండన్ వెళ్లారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టులో అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్ర వైద్యుడు డాక్టర్ లోకేష్ ఉన్నారు. ఆయన సీఎం పర్యటనను అడ్డుకోవడానికి వచ్చారంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని టీవీ చానళ్లలో ఆయన మాట్లాడి ఉండటంతో పోలీసుల తీరు వివాదాస్పదమయింది.
అమెరికా నుండి వచ్చిన ఎన్ ఆర్ ఐ డాక్టర్ లోకేష్ ఉయ్యూరు గారిని అరెస్ట్ చేసి, చితక బాది హింసించిన పోలీసులు ప్రస్తుతం ఆయుష్ హాస్పిటల్ ట్రీట్మెంట్ విజయవాడ పశ్చిమ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడానికి సన్నాహాలు ఏమిటి ఈ రాక్షస పాలన @APPOLICE100 @HMOIndia pic.twitter.com/RwUyrvWWKj
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) May 18, 2024
అనుమానాస్పదంగా తిరుగుతూండటంతో గన్నవరం ఎయిర్ పోర్టులో అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నామని, అయితే అనారోగ్యంగా ఉందని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. అయితే లోకేష్ ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, కిడ్నాప్ చేశారని, వేధించారని, చివరకు ఆయన అనారోగ్యం పాలవ్వడంతో ఆస్పత్రిలో చేర్చారనే ప్రచారం జరిగింది. తర్వాత ఆయనను పోలీసులు వదిలి పెట్టారు.
వైసీపీ స్పాన్సర్డ్ రౌడీయిజం ఏపీలో ఇంకా కొనసాగడం చాలా దురదృష్టకరం. జగన్ అవినీతి, అరాచకాలను ప్రశ్నించిన NRI డాక్టర్ లోకేష్ కుమార్ని గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, దాడికి పాల్పడటం దారుణం. పోలీసులం అని చెబుతూ అమెరికా పౌరుడైన డాక్టర్ లోకేష్ కుమార్… pic.twitter.com/nqLMVXAyU2
— Lokesh Nara (@naralokesh) May 18, 2024
అమెరికన్ సిటిజన్, అక్కడ ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని బెదిరించిన వైనం సోషల్ మీడియాలో సంచనలంగా మారింది. అసలు ప్రత్యేక విమానంలో వెళ్లే జగన్ ను ఆయన ఎలా అడ్డుకుంటారని.. ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ పోర్టులో ఉన్న సమయంలో కావాలనే ఆయనను అదుపులోకి తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు వదిలి పెట్టడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయనను టీడీపీ నేతలు పరామర్శించారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డాక్టర్ లోకేష్ గారిపై 20 మంది పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించిన తీరు దుర్మార్గమని దేవినేని ఉమ మండిపడ్డారు.
గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అమెరికా సిటిజన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ లోకేష్ గారి పై సీఎం భద్రత సిబ్బంది దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. దాడి విషయం తెలుసుకున్న వెంటనే సీనియర్ లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ, మీడియా ఇన్ఛార్జ్ దారపనేని నరేంద్ర ఇతర నేతలతో కలిసి… pic.twitter.com/F0L87nzmxt
— Devineni Uma (@DevineniUma) May 18, 2024
ఎయిర్ పోర్టులో డాక్టర్ లోకేష్ ని గుర్తు పట్టిన వైసీపీ నాయకులు సీఎం సెక్యూరిటీకి సమాచారం అందించారని.. ఒక సీనియర్ డాక్టర్, అమెరికా సిటిజెన్ ను మ్యాన్ హ్యాండిల్ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఏ రాజకీయ నాయకుడి డైరెక్షన్ లో సీఎం సెక్యూరిటీ అధికారులు ఈ పనిచేశారో స్పష్టం చేయాలన్నారు. అమెరికన్ సిటిజన్ అయినా మాతృభూమిపై ప్రేమతో ఇక్కడ జరుగుతున్న దోపిడీ, అరాచకాలపై సోషల్ మీడియాలో స్పందించినందుకే కక్ష కట్టారని.. ఆరోపించారు. తక్షణమే బాధ్యులైన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేస్తాం. తప్పు చేసిన ఏ అధికారి తప్పించుకోలేడని హెచ్చరించారు.