News
News
X

Padayatra Politics : తెలుగు రాష్ట్రాల్లో నడిచేస్తున్న నేతలు - అధికారానికి దగ్గరి దారి పాదయాత్ర !

పాదయాత్ర చేస్తే అధికారం అందుతుందా ? రాజకీయ నేతలు పాదయాత్రకే ఎందుకు మొగ్గు చూపుతున్నారు ?

FOLLOW US: 

Padayatra Politics :  పాదయాత్ర చేస్తే నడుచుకుంటూ అధికారానికి దగ్గరగా  వెళ్లిపోవడమేనని రాజకీయవర్గాలు గొప్ప సెంటిమెంట్‌తో ఉన్నాయి. అందుకే దేశంలో ఇప్పుడు పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఎన్నికలు మరో ఏడాదో..రెండేళ్లో ఉన్నయనగా రాజకీయ పార్టీలన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ముఖ్య నేతలు పాదయాత్రలు చేపడతారు. గత రెండున్నర దశాబ్దాలుగా సాగుతోంది. ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. అయితే ఈ సారి ఆ పాత్ర నేషనల్ రేంజ్‌కు చేరింది. అయితే పాదయాత్రలో వైఫల్యాలూ ఉన్నాయి. పాదయాత్రతోనే విజయం రాదనే సంకేతాలు కూడా ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్న పార్టీలేవీ పాదయాత్రలు చేయడం లేదు.. అధికారం కోసం ప్రయత్నించే వారే చేస్తున్నారు.

భారత్ జోడో యాత్రతో రాహుల్ నడక 

ఓ రాష్ట్రంలో పాదయాత్ర చేయవచ్చు కానీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయవచ్చా అంటే.. కష్టం అంటారు. కానీ  శారీరకంగా ఫిట్‌గా ఉండే రాహుల్ గాంధీ ఈ టాస్క్ తీసుకున్నారు. భారత్  జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి ప్రారంభించారు. కశ్మీర్ వరకూ వెళ్తారు. రోజుకు పాతిక కిలోమీటర్ల వరకూ నడుస్తారు. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. ఆయన పాదయాత్ర కాంగ్రెస్‌లో కొత్త జోష్ తెస్తోంది. ఆయా రాష్ట్రాల్లో వస్తున్న జన స్పందన కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ వేవ్ తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు సక్సెస్ ఇమేజ్ !

దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ మొదటి సారి పాదయాత్ర చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో ఈ పాదయాత్ర సక్సెస్ ఫార్ములాగా మారింది. చంద్రబాబు రెండు సార్లు సీఎం అయి... మూడో సారి గెలుస్తారేమో అన్నంత ఊపులో ఇక తాడోపేడో పోరాటం అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. అది తెచ్చి పెట్టిన విజయం గురించి మనం మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. ఆ తర్వాత  చంద్రబాబు  ప్రతిపక్షంలో పాదయాత్ర చేయడానికి సిద్ధపడలేదు. బస్సు యాత్ర చేశారు. కానీ ఫలితం కనిపించలేదు. ఇక తప్పదనుకుని అరవై ఏళ్లు దాటిన తర్వాత పాదయాత్ర చేశారు. 2014లో సీఎం అయ్యారు.  చంద్రబాబును ఓడించడానికి మళ్లీ జగన్ పాదయాత్ర చేశారు. 2019లో సీఎం  అయ్యారు. ఇలా ప్రతీ సారి సీఎం  అవుతున్న వారంతా పాదయాత్రలు చేస్తున్న వారే. 

ఫెయిల్యూర్ పాదయాత్రలు కూడా ఉన్నాయి !

తెలుగు రాష్ట్రాల్లో అన్ని పాదయాత్రలు సక్సెస్ అవలేదు. ఫెయిల్యూర్ పాదయాత్రలు కూడా ఉన్నాయి. 2014  ఎన్నికలకు ముందు  జగన్ జైల్లో ఉన్నారు. పార్టీ కోసం షర్మిల రంగంలోకి దిగారు. పాదయాత్ర చేశారు. అత్యంత సుదీర్ఘమైన పాదయాత్ర ఆమె చేశారు. కానీ వైఎస్ఆర్‌సీపీకి విజంయ దక్కలేదు. షర్మిల పార్టీ కోసం పడిన కష్టం ఫలితం ఇవ్వలేదు. 

ఇప్పుడు విజయం కోసం వరుస పాదయాత్రలు !

తెలంగాణలో ఇప్పుడు పాదయాత్రల సీజన్ నడుస్తోంది. బండి సంజయ్ విడతల వారీగా తెలంగాణ మొత్తం నడిచేస్తున్నారు. షర్మిల ఇప్పటికే రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేశారు., కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో నడిచారు. రేవంత్ రెడ్డి కూడా  పాదయాత్ర చేయాలనుకున్నారు కానీ కాంగ్రెస్‌లో వర్గ పోరాటం వల్ల కుదరలేదు. ఈ లోపు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుంది కాబట్టి ఆ పాదయాత్రపై దృష్టి పెట్టారు. 

ఏపీలో ఈ సారి పాదయాత్ర నారా లోకేష్ వంతు !

ఏపీలో ఈ సారి పాదయాత్ర నారా లోకేష్ వంతు. గత నాలుగేళ్లుగా ఆయన ప్రజల్లో గుర్తింపు కోసం రాజకీయ పోరాటం చేశారు. హావభావాలు, వేషధారణ మార్చుకున్నారు. ఫిట్‌గా  మారారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు 70 ఏళ్లు దాటిపోయినందున ఆయన పాదయాత్ర చేయలేరు. ఈ కారణంగా ఆ బాధ్యత లోకేష్ తీసుకోవాలని నిర్ణయించారు. జనవరి నుంచి ప్రారంభించి వచ్చే ఎన్నికల వరకూ ఆయన  పాదాయత్ర కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాల పర్యటనల్లో లోకేష్ టీడీపీ క్యాడర్ మద్దతు పొందినందున పాదయాత్రపై పాజిటివ్ స్పందన వస్తోంది.  అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

అధికారం కోసమే.. అధికారంలో ఉన్న  వాళ్లకి పట్టదు !

పాదయాత్ర చేసి అధికారంలోకి వస్తారు . అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్ర చేయాలన్న ఆలోచన ఇంత వరకూ ఎవరూ చేయలేదు. పాలనలో  బిజీగా ఉంటామని కారణాలు చెప్పుంటారేమో కానీ.. తమ సీటు కోసం మరోకరు నడుస్తున్నారని తెలిసినా..  ముందుకు కదలరు. ఫలితంగా కుర్చీ చేజారిపోతుంది. ఈ పాదయాత్రలు ఎవరికి  అదృష్టం తెచ్చి పెడుతుందో వేచి చూడాలి ! 

Published at : 20 Sep 2022 07:00 AM (IST) Tags: Lokesh Bharat Jodo Yatra Politics Political Padayatras Rahul Gandhi Padayatras

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

టాప్ స్టోరీస్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?