అన్వేషించండి

Botsa On Chiranjeevi : నేను సీఎం కాకుండా అడ్డుకున్నది చిరంజీవి - బొత్స జ్ఞాపకాలు !

Botsa : తాము ముఖ్యమంత్రి కాకండా చిరంజీవి అడ్డుపడ్డారని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తర్వాత ఆయననే తానే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించానన్నారు.

Botsa On Chiranjeevi  :  ఉమ్మడి రాష్ట్రంలోనే తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని కానీ చిరంజీవి అడ్డుపడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు  చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరవాత రోశయ్యను సీఎంను చేశారు. రోశయ్య తాను పదవిలో కొనసాగలేనని చెప్పిన తర్వాత.. పార్టీ నేతలు చాలా మంది సీఎం పదవి కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో ..  సీనియర్ మంత్రిగా పీసీసీ చీఫ్‌గా ఉన్నా బొత్స సత్యనారాయణ తనకు  సీఎం పోస్ట్ వస్తుందనుకున్నారు. అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా నియమించారు. 

సీఎం పదవి రాకుండా చిరంజీవి అడ్డుపడ్డారు                   

ఆ సమయంలో తెర వెనుక ఏం జరిగిందో బొత్స సత్యనారాయణ ఇప్పుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. సీఎం పదవి కోసం జరిగిన చర్చల్లో ప్రజా రాజ్యం పార్టీని కూడా పరిగణనలోకి తీసుకున్నారని అంటున్నారు.  ఈ సందర్భంలో బొత్స సత్యనారాయణకు చిరంజీవి మద్దతుగా నిలువలేదని  తెలుస్తోంది. అందుకే తనకు సీఎం పదవి రాలేదని.. చిరంజీవి అడ్డుపడ్డారని బొత్స అంటున్నారని  భావిస్తున్నారు. అప్పటికే కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం కాలేదు. తర్వాత తానే చిరంజీవికి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించానని  బొత్స చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో చేరకపోయి ఉంటే  కాంగ్రెస్‌లో చేరకపోయి ఉంటే చిరంజీవి సీఎం అయ్యేవారు బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. 

రాజకీయాల నుంచి  విరమించుకున్న చిరంజీవిపై ఇప్పుు వ్యాఖ్యలు ఎందుకు ?                   

రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు బొత్స ఎందుకు హఠాత్తుగా చిరంజీవి పేరు తీసుకు వచ్చి తనను సీఎం కాకుండా అడ్డుకున్నారని.. కాంగ్రెస్‌లో కలపకుండా ఉంటే..సీఎం అయ్యే వారని  వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారన్న సందేహాలు రాజకీయవర్గాల్లో ప్రారంభయ్యాయి. చిరంజీవి తన పొలిటికల్ ఇన్నింగ్స్ ను పూర్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే ఆయన ఎక్కడా రాజకీయ పరమైన కామెంట్లు చేయడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. 

చిరంజీవి ని ఎందుకు తీసుకొస్తున్నారు ?
 
ఇలాంటి సమయంలో బొత్స .. చిరంజీవి ప్రస్తావన తీసుకువచ్చి తనకు ఏదో అన్యాయం చేశారన్నట్లుగా మాట్లాడటం.. ప్రజా రాజ్యం పార్టీ విలీనం గురించి చెప్పడం రాజకీయ వ్యూహమేనని అంటున్నారు. బొత్సకు ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో.. చిరంజీవి కూడా తాను ప్రజా రాజ్యం అధ్యక్షుడిగా ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. బొత్సకు సపోర్టు చేయాలా లేదా అన్నదానిపై ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. బొత్సను సీఎం చేయాలని చిరంజీవి లక్ష్యంగా పెట్టుకుని ఉండరు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఇప్పుడు మరో కోణం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.                     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
Breaking News: ఇరాన్‌ అధ్యక్షుడు పెజష్కియాన్‌ రాజీనామా చేశారా ?
ఇరాన్‌ అధ్యక్షుడు పెజష్కియాన్‌ రాజీనామా చేశారా ?
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget