అన్వేషించండి

ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మిగ్‌జాం తుపాను- అధికార యంత్రాంగం అప్రమత్తం

Weather Updates: ఏపీ, తమిళనాడులో మిగ్‌జాం తుపాను బీభత్సం సృష్టించబోతోంది. తీరం దాటే ప్రాంతమైన దివిసీమకు భారీ ముప్పు పొంచి ఉంది. దివిసీమ ప్రజలు భయభయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

Cyclone Michaung updates: ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మిగ్‌జాం తుపాను బీభత్సం సృష్టించబోతోంది. తీరం దాటే ప్రాంతమైన దివిసీమకు భారీ ముప్పు పొంచి ఉంది. దివిసీమ ప్రజలు భయభయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. తీవ్ర రూపం దాల్చిన తుపాను నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని చెప్పడంతో ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నంలో ఏడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. 

నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేశారు. లోతట్టు  ప్రాంత ప్రజలను, తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలిస్తున్నారు. వారి కోసం మందులు, ఆహార ధాన్యాలు, చిన్న పిల్లలకు పాలు సిద్ధం చేశారు. 

కోత కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మిగతా పంట నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరూ కోతలు చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల్లో మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 23 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదు అయింది. 

తుపాను ప్రభావంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఎవరూ ఎలాంటి ప్రత్యేక క్లాస్‌లు పెట్టొద్దని అధికారులు ఆదేశించారు. తుపానుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని సూచించారు. సహాయక పునరావాస కేంద్రాల విషయంలో రాజీ వద్దని అన్నారు. దీంతో రెవెన్యూ శాఖ ఐదు జీవోలు విడుదల చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు 11 కోట్లను అత్యవసరంగా విడుదల చేసుకునే వెసులుబాటు కల్పించింది. 

సహాయక చర్యల కోసం నెల్లూరులో నాలుగు , బాపట్లలో మూడో, కృష్ణాలో రెండు తిరుపతి ప్రకాశం జిల్లాలో ఒక్కో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసి ఉంచారు. ఈ జిల్లాల్లో మొత్తంగా 192 పునరావాస కేంద్రాలు రెడీ చేశారు. ఇప్పటికే ఏడు వేల మందినీ శిబిరాలకు తరలించారు. 
సహాయక శిబిరాల నుంచి బాధితులను ఇంటికి పంపే సమయంలో రెండువేల ఐదు వందల రూపాయలు ఇవ్వనున్నారు. దీంతోపాటు ఆయా కుటుంబాలకు పాతిక కేజీల బియ్య, కేజీ కందిపప్పు, ఒక లీటర్ నూనె, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు అందజేస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget