అర్నబ్ తుపాను ప్రస్తుతం విశాఖపట్నానికి 260 కి.మీ, కాకినాడకు 300 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 22 కి.మీ వేగంతో ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది.
AP Flash Floods: అర్నబ్ తుఫాన్.. 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసి ప్రజల్ని అప్రమత్తం
Cyclone Arnab Flash Floods | అర్నబ్ అతి తీవ్ర తుపానుగా మారడంతో విశాఖపట్నం, గుంటూరు సహా 14 జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.

- అర్నబ్ అతి తీవ్ర తుఫానుగా మారి ఏపీ వైపు దూసుకొస్తోంది.
- తీరం వద్ద 14 జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు.
- సీఎం సమీక్ష, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
- ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచన.
అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ అతి తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు ఏకంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఈ తుపాను ప్రస్తుతం విశాఖపట్నానికి 260 కిలోమీటర్లు, కాకినాడకు 300 కి.మీ, మచిలీపట్నానికి 390 కిలోమీటర్లు, బాపట్లకు 460 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉనట్లు అధికారులు వెల్లడించారు. అర్నబ్ తుపాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో, రాబోయే 2 రోజుల పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
14 జిల్లాలకు ఆకస్మిక వరదలు..
అర్నబ్ అతి తీవ్ర తుపానుగా మారడంతో దీని ప్రభావంతో రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ (ఆకస్మిక వరద) హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలలో వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు ఎవరూ బయటకు రాకుండా సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు విడుదల చేసింది. బాపట్ల, కృష్ణా, ప.గో., కోనసీమ, తూ.గో., కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. శ్రీకాకుళం,మార్కాపురం,గుంటూరు, ఎన్టీఆర్,ఏలూరు,అల్లూరి, https://t.co/xVyzXjwEVw
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 26, 2026
అటు సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో రాకాసి అలల ధాటికి రాళ్లగట్టు దాటుకుని సముద్రపు నీరు రోడ్లపైకి చేరుతోంది. దీంతో బీచ్ రోడ్డుపై రాళ్లు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తుపాను పరిస్థితుల తీవ్రతపై సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నతాధికారులతో ఇదివరకే అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 11 జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా ఎక్కడైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు.
తుపాను బాధితులకు తక్షణ సహాయం, సమాచారం కోసం జిల్లా, మండల స్థాయిలలో మొత్తం 2,907 అత్యవసర కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. అర్నబ్ తుపాను ప్రభావిత జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ప్రజలు అత్యవసర సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్, హెల్ప్‌లైన్ల ద్వారా అధికారులను సంప్రదించి సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Frequently Asked Questions
అర్నబ్ తుపాను ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది?
అర్నబ్ తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రభావం ఉండవచ్చు?
రాబోయే 2 రోజుల పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. 14 జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
తుపాను ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటోంది?
ప్రభుత్వం 11 జిల్లాలకు NDRF, SDRF బృందాలను పంపి, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. సమాచారం కోసం 2,907 అత్యవసర కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.
తుపాను సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రజలు ఎవరూ బయటకు రాకుండా సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. అత్యవసర సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్, హెల్ప్‌లైన్‌లను సంప్రదించాలని సూచించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























