CPI Narayana: సనాతన ధర్మాన్ని సమర్థించే వారిని పవన్ తో సహా అరెస్టు చేయాలి - సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు
Sanatana Dharma: సనాతన ధర్మం, పవన్ కల్యాణ్ పై సీపీఐ నారాయణ చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

CPI Narayana criticisms of Sanatana Dharma: సీపీఐ నేత నారాయణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు సనాతన ధర్మాన్ని సమర్థించే వారిని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణ సనాతన ధర్మాన్ని "క్రూరమైనది", "అరాచకమైనది" అని విమర్శించారు, ఇది సమాజంలో వివక్ష, కులవ్యవస్థను ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ నారాయణ సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు పవన్ కళ్యాణ్ విడాకులు ఎలా తీసుకున్నారని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని , సనాతన ధర్మాన్ని కించ పరుస్తూ నారాయణ మాట్లాడారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సనాతన ధర్మాన్ని సమర్థించే వారిని, పవన్ కళ్యాణ్‌తో సహా, అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యను ఆయన సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలన్న పవన్ కళ్యాణ్ గత వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చేశారు. సనాతన ధర్మాన్ని కులవ్యవస్థ, చాతుర్వర్ణ్య వ్యవస్థకు సంబంధించినదిగా నారాయణ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలని గతంలో చేసిన వ్యాఖ్యలకు నారాయణ చేసిన వ్యాఖ్యలు కౌంటర్ గా భావిస్తున్నారు.
సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు
— Journalist Vijaya Reddy (@VijayaReddy_R) June 4, 2025
సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు, కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలి - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ pic.twitter.com/zKNi1LQEI4
DMK నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అప్పట్లో ఈ అంశం తీవ్రమైన వివాదాన్ని రేకెత్తించింది. నారాయణ వ్యాఖ్యలు అలాగే ఉండటంతో ఆయనపై విమర్శలువస్తున్నాయి. గా పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని సూచిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వీటిని వ్యక్తిగత దాడిగా , హిందూ మతాన్ని అవమానించే ప్రయత్నంగా పలువురు మండిపడుతున్నారు.
కమ్యూనిస్టులకు ఏమైందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 4, 2025
ఆ పేరు ఎత్తితే అరెస్టు చేయాలి.
-CPI నేత నారాయణ గారు కామెంట్స్.
అసలు కమ్యూనిష్టులకు ఏమైంది?
హఠాత్తుగా పవన్ ను టార్గెట్ చేయడం వెనుక కుట్ర ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ ను విమర్శిస్తే పబ్లిసిటీ వస్తుందని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం అంటే ఎప్పుడో పురాతన కాలంలో చెప్పుకున్న విషయాలు కాదని మారుతున్న కాలంలో మానవత్వం చూపడమే సనాతన ధర్మమనిచెబుతున్నారు. హిందూత్వాన్ని విమర్శించడం లౌకికవాదం అంటున్నారని కానీ ఇతర మతాల జోలికి వెళ్లలేరని అంటున్నారు. వారికి అంత గౌరవం ఇచ్చినప్పుడు.. హిందూత్వానికి కూడా ఇవ్వాలి కదా అని పవన్ వాదన. అయితే సనాతన ధర్మం అంటే.. ఎప్పుడో శతాబ్దాల కిందట చెప్పినట్లుగా.. అంటరానితనం.. కుల వివక్ష అని చెబుతూండటంతో సమస్య వస్తోంది.




















