News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Coronavirus Cases Today: ఏపీలో కొత్తగా 865 మందికి కరోనా పాజిటివ్.. రెండు జిల్లాలో భారీ కేసులు

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో వెయ్యి దిగువన కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

FOLLOW US: 
Share:

ఏపీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల వెయ్యి దిగువకు వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు ఈ వారం సైతం మళ్లీ వెయ్యి పైగా వచ్చాయి. తాజాగా మరోసారి వెయ్యి దిగువన కొవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 50 వేల శాంపిల్స్ పరీక్షించగా 865 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

లేటెస్ట్ బులెటిన్..

నిన్నటితో పోల్చితే ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో రాష్ట్రంలో మరో 9 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. ఏపీలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 14,195 మంది మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,96,103 పాజిటివ్ కేసులకు గాను.. 20,24,334 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.  రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 11 వేలకు దిగొచ్చాయి. ఏపీలో ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,574 అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శనివారం తాజా బులెటిన్‌ విడుదల చేసింది.
Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం 

రికవరీ రేటు భేష్..

ఏపీలో కరోనా రికవరీ రేటు మెరుగ్గానే ఉంది. కరోనా పాజిటివ్ కేసులకు రెట్టింపు డిశ్ఛార్జ్ కేసులు ఉండటం ఊరట కలిగిస్తుందని రాష్ట్ర వైద్య శాఖ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజులో 865 మంది కరోనా బారిన పడగా, అదే సమయంలో 1,424 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజులో ఏపీలో చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దురు, కృష్ణాలో ఇద్దరు కరోనాతో చనిపోయారు.

Also Read: స్నాక్స్ గా నాలుగు గింజలు నోట్లో వేసుకున్నా చాలు... ఎంతో మేలు

ఏపీలో నేటి ఉదయం వరకు 2 కోట్ల 84 లక్షల 471 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో గడిచిన 24 గంటల్లో 50,304 శాంపిల్స్‌కు కరోనా టెస్టులు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పు గోదావరిలో 172, చిత్తూరులో 168, గుంటూరులో 117, ప్రకాశంలో 90 మందికి తాజాగా కరోనా సోకింది. శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో అత్యల్పంగా 4 మంది కరోనా బారిన పడ్డారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Oct 2021 08:38 PM (IST) Tags: coronavirus covid19 AP AP News ap corona cases Corona Positive Cases Coronavirus Cases Today

ఇవి కూడా చూడండి

Top Headlines Today: గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి నిరాహారదీక్ష - మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌

Top Headlines Today: గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి నిరాహారదీక్ష - మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌

Breaking News Live Telugu Updates: ఏపీలో 12 రోజులు దసరా సెలవులు

Breaking News Live Telugu Updates: ఏపీలో  12 రోజులు దసరా సెలవులు

Chandrababu Naidu Arrest : గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి నిరాహారదీక్ష - పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీలో కీలక నిర్ణయం !

Chandrababu Naidu Arrest :   గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి నిరాహారదీక్ష - పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీలో కీలక నిర్ణయం !

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

Chandrababu Naidu Arrest : చంద్రబాబు మాజీ పీఎస్‌ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !

Chandrababu Naidu Arrest :  చంద్రబాబు మాజీ పీఎస్‌ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !

టాప్ స్టోరీస్

మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌- హింట్ ఇచ్చిన హరీష్

మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌- హింట్ ఇచ్చిన హరీష్

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్

Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్

KTR : రాముడైనా , కృష్ణుడైనా ఎన్టీఆరే - ఖమ్మంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ !

KTR : రాముడైనా , కృష్ణుడైనా ఎన్టీఆరే - ఖమ్మంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ !