అన్వేషించండి

Guntur Name Contro : గుంటూరు ఏటీ అగ్రహారం పేరు ఫాతిమానగర్‌గా మార్పు - భగ్గుమన్న బీజేపీ !

గుంటూరులోని ఏటీ అగ్రహారం పేరు మార్పుపై వివాదం ఏర్పడింది. బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.


Guntur Name Contro :  గుంటూరులో ఏటీ ఆగ్రహారం పేరును ఫాతిమాపురంగా మార్చిన వ్యవహారం వివాదాస్పదమవుతోంది.  వంద సంవత్సరాల చరిత్ర కలిగి...అగ్రహారం గా ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా పేరు మారుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  గుంటూరుతో  పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఏ.టీ. అగ్రహారం సుపరిచితమే...ఏ.టీ. అగ్రహారం మూలాలు గుంటూరు నగరంతో అంతగా ముడి పడి ఉన్నాయి..వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాంతం ఆనంద   త్రిదండి అగ్రహారం కాల క్రమేణ ఏ.టీ. అగ్రహారంగా మారింది. గుంటూరు పట్టణం అంతగా విస్తరించని రోజులలో‌ పట్టణానికి దూరంగా ఏ.టీ. అగ్రహారం రూపు దిద్దుకుంది. 

పేరు మార్పుపై ప్రజలలో‌ వ్యతిరేకత

గుంటూరు నగరం వేగంగంగా అభివృద్ధి చెందటంతో.. ఏటీ అగ్రహారం పట్టణ నడిబోడ్డుగా మారింది..మొత్తం 21 లైన్లతో శరవేగంగా అభివృద్ధి చెందింది.ఈ ప్రాంతంలో 95 శాతం హింధువులు 5 శాతం తతిమా వర్గాల వారు ఉంటారు..హిధువులలలో వివిధ కులాల  వారు ఉన్నపట్టికి ఏ.టీ. అగ్రహారం వాసులమని చెప్పుకొవడం ఈ ప్రాంత వాసులు  గౌరవంగా భావిస్తారు. ఈ ప్రాంతాన్ని అభిమానిస్తారు, ప్రేమిస్తారు...కానీ ఈ ప్రాంత వాసులు ఒక్క సారిగా మునిసిపల్ కార్పోరేషన్ తీరుపై, అధికార పార్టీ నాయకుల వ్యవహారంపై మండి పడుతున్నారు.  ఏ.టీ. అగ్రహారం పేరు మార్పును వ్యతిరేకిస్తూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.  ఏ.టీ అగ్రహారంగా సుపరిచితమైన ప్రాంతానికి పేరు ఎందుకు మార్చ‌వలసి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 

బీజేపీ నేతల తీవ్ర విమర్శలు 

ఏటీ అగ్రహారం పేరు మార్పును బీజేపీ తీవ్ర స్థాయిలో కండించింది. ఓ మతం వారికి  ప్రజాధనంతో జీతాలిస్తారుని..  ఎంపీ ల్యాడ్స్‌తో  ఓ మత ప్రార్థనలకు నిర్మాణాలు చేస్తారని .. ఇప్పుడు కాలనీలకు పేర్లు మార్చేస్తున్నారని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.  ప్రత్యేకంగా జీవోలిచ్చి మరీ కొన్ని  మతాల కోసం నిధులు మంజూరు చేస్తున్నారని..  మత మార్పిళ్లకు కావాల్సినంత స్వేచ్చ ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.  ఇప్పుడు కాలనీలకు కాలనీలననే మతం మార్చేస్తున్నాని మండిపడ్డారు.  రాత్రికి రాత్రే గుంటూరులో ఏటీ  అగ్రహారాన్ని ఫాతిమాపురంగా ఎలా మారిందని విష్ణువర్ధన్ రెడ్డి , సోము వీర్రాజు ప్రశ్నించారు.  

 
  
సర్వే చేసి మారుస్తామన్న కార్పొరేషన్ అధికారులు

ప్రజాగ్రహంతో కార్పొరేషన్ అధికారుల దిద్దుబాటు చర్యలకు సన్నద్ధమయ్యారు. .నగరపాలక సంస్థ కమిషనర్  చెరుకూరి కీర్తీ ప్రస్ నోట్ రిలీజ్ చేశారు. .స్వచ్చ‌ సర్వేక్షణ్ లో బాగంగా నోటిఫైడ్ ప్రాంతాలలో నేమ్ బోర్డులను ఏర్పటు చేశామని తెలిపారు. పక్క ప్రాంతంలో ఏర్పాటు చేయవలసిన బోర్డు పొరపాటున ఈ ప్రాంతంలో‌ ఏర్పాటు చేసారని తెలిపారు. కుల, మతాలు రెచ్చగొట్టే విధంగా తాము ప్రవర్తించమని వివరించారు.. సంఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక అందించాలని కోరామన్నారు..నివేదిక ప్రకారం చర్యలుంటాయన్నారు..ప్రజల‌ మనోభావాలకు భిన్నాంగా కార్పోరేషన్  చర్యలు తీసుకోదని స్పష్టం చేశారు..తక్షణమే వివాదానికి కారణమైన నేమ్ బోర్డును తొలగిస్తామన్నారు

కుట్రపూరితంగానేబోర్డు పెట్టారంటున్న స్థానికులు

ఒక పథకం ప్రకారమే పేరు మార్పునకు శ్రీకారం చుట్టారని స్థానికులు అంటున్నారు. .నెల‌ రోజుల‌ క్రితమే బోర్డు తొలగించ మని రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకొని అధికారులు ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారో అర్థమైదని చెబుతున్నారు. .జీరో లైన్ లో‌ ఏర్పాటు చేయవలసిన బోర్డ్ రెండవ లైన్ లో‌ ఏర్పాటు చేయడంలోనే ఆతర్యం ఉందని...కొంత కాలం ఫతిమా నగర్ బోర్డు అక్కడ ఉంచి  తర్వాత సర్వే చేయించి ఆతర్వాత నోటిఫైడ్ చేయిస్తే రికార్డు లలో పేరు మర్పు జరుగుతుంది.  ఆ ప్లాన్ తోనే మొత్తం స్కెచ్ వేశారని స్థానికులలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తునారని తెలియ చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget