By: ABP Desam | Updated at : 03 May 2023 05:41 PM (IST)
మధురవాడ నుంచి ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గం ద్వారా సీఎం జగన్
CM Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటీవల తరచూ అనుకోకుండా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాల్సి వస్తోంది. తాజాగా విశాఖలో మధురవాడలో ఐటీ హిల్స్‌లో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం... అక్కడ్నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సి ఉంది. ఇందు కోసం హెలికాఫ్టర్ ను రెడీ చేశారు. అయితే అనూహ్యంగా వర్షం పడుతూండటంతో హెలికాఫ్టర్ ఎగరడానికి అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కాసేపు చూసిన సీఎం జగన్ వర్షం ఆగేలా లేకపోవడం.. సమయం మించి పోతూండటంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మధురవాడ నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు దాదాపుగా ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది.
దీంతో అధికారులకు ముందుగా అలర్ట్ చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ చేయించారు. రోడ్డు మార్గం ద్వారా సీఎం వెళ్తున్నారన్న విషయాన్ని బయటకు తెలియనివ్వలేదు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాతనే విషయం తెలిసింది. వర్షం పడుతున్నప్పటికీ ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం వెళ్లడానికి ఎలాంటి సమస్యలు ఎదురు కాకపోవడంతో బయలుదేరి వెళ్లారు. ఇటీవల అనంతపురం జిల్లాలో ఇలా హెలికాఫ్టర్ మొరాయించడంతో నార్పల నుంచి పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. ఈ సమయంలో దారిలో కొన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని అడ్డుకున్నారు. ఈ ఘటనతో ముందస్తుగా రోడ్డు మార్గ ప్రయాణాలపై సీఎం సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదట గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ మీదుగా సీఎం జగన్ విశాఖ చేరుకున్నారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ ద్వారా బోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ శంకుస్థాపన కార్యక్రమం తర్వాత హెలికాఫ్టర్ లో మధురవాడ వచ్చారు. మధురవాడలో అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు.
విశాఖలో అదానీ గ్రూపుకి చెందిన వైజాగ్టెక్ పార్కు లిమిటెడ్‌కు సీఎం శంకుస్థాపన. దీంట్లో భాగంగా 300 మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ పార్క్, స్కిల్ సెంటర్లు రాక. దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,610 మందికి ఉద్యోగాలు. కార్యక్రమంలో పాల్గొన్న రాజేష్ అదానీ, కరణ్ అదానీ. pic.twitter.com/aWzdfOsGI5
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 3, 2023
అయితే ఆ తర్వాత వర్షం పెరగంతో .. హెలికాఫ్టర్ టేకాఫ్‌కు సమస్యలు ఏర్పడ్డాయి. భద్రతా కారణాలతో అధికారులు అంగీకరించకపోవంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి వచ్చింది.
Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య
Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!
GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!