News
News
X

CM Jagan: తోడేళ్లన్నీ ఓవైపు, మీ బిడ్డ సింహంలా మరోవైపు - అస్సలు భయం లేదు: సీఎం జగన్

వినుకొండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌ ఈ సందర్భంగా విపక్షాలపై ఎప్పటిలాగానే విమర్శలు చేశారు.

FOLLOW US: 
Share:

జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేశారు. వినుకొండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌ ఈ సందర్భంగా విపక్షాలపై ఎప్పటిలాగానే విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటువైపు సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడని సీఎం జగన్‌ అన్నారు. మీ బిడ్డకు ఎలాంటి పొత్తుల్లేవని, మీ బిడ్డ వాళ్ల మీద, వీళ్ల మీద నిలబడడని అన్నారు. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డ జగన్ కు భయం లేదని అన్నారు. ఎందుకంటే తాను ప్రజలను, దేవుడిని నమ్ముకున్నానని అన్నారు.

ఇది పేదవాడికి, పెత్తందారుకి మధ్య నడుస్తున్న యుద్ధం అని అన్నారు. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే, వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నాయని అన్నారు. గజ దొంగల పాలన కావాలా? లంచాలు, అవినీతికి చోటు లేని పాలన కావాలా? అని ప్రజల్ని అడిగారు.

గతంలో గజదొంగల ముఠా ఏపీని దోచేశారని వ్యాఖ్య చేశారు. చంద్రబాబును ముసలాయనగా అభివర్ణించారు. అప్పట్లో గజ దొంగల ముఠా ఉండేదని.. కొన్ని మీడియా సంస్థల పేర్లు చెప్పారు. వారితో పాటు చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా గతదొంగల ముఠా అని అన్నారు. మరి వీళ్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వాళ్ల విధానం డీపీటీ అని.. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని సీఎం జగన్‌ అన్నారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారు కదా అని గుర్తు చేశారు.

Published at : 30 Jan 2023 01:26 PM (IST) Tags: CM Jagan chandrababu Pawan kalyan Jagananna Chedodu Vinukonda meeting YSRCP news

సంబంధిత కథనాలు

Tiger in Mahabubnagar: ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన తల్లిపులి - నల్లమలలో తిరుగుతున్నట్టు గుర్తింపు! 

Tiger in Mahabubnagar: ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన తల్లిపులి - నల్లమలలో తిరుగుతున్నట్టు గుర్తింపు! 

విధేయ‌త‌+స‌మ‌ర్థ‌త‌= పంచుమ‌ర్తి అనూరాధ, స్ఫూర్తిదాయ‌క ప్ర‌స్థానం

విధేయ‌త‌+స‌మ‌ర్థ‌త‌= పంచుమ‌ర్తి అనూరాధ, స్ఫూర్తిదాయ‌క ప్ర‌స్థానం

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆ రెండు సీట్లు కూడా రావు- మంత్రి రోజా విమర్శలు

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆ రెండు సీట్లు కూడా రావు- మంత్రి రోజా విమర్శలు

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

టాప్ స్టోరీస్

Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు

Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు

దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ

పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ

OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే

OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే