By: ABP Desam | Updated at : 26 May 2023 10:19 PM (IST)
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. శుక్రవారం (మే 26) సాయంత్రం వారి సమావేశం దాదాపు 40 నిమిషాలసేపు సాగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారి వివరాల ప్రకారం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన ఆర్థిక సహాయానికి సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు.
2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్య కాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపులు తదితర అంశాలను సీఎం జగన్ ఆర్థిక మంత్రితో చర్చించారు. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్, రూ.6,756.92 కోట్ల బకాయిల అంశాన్నీ ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకొచ్చిన అంశాన్నీ సీఎం గుర్తుచేశారు.
ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ డబ్బు ఇప్పించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని చెప్పారు. స్కూళ్లలో నాడు - నేడు కింద ఇప్పటికే రూ.6 వేల కోట్లు ఖర్చుచేసిందని, తొలి దశ కింద 15,717 స్కూళ్లలో నాడు - నేడు కూడా పూర్తయ్యిందని, ఆరో తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు.
అలాగే ఆరోగ్య రంగంలో కూడా నాడు - నేడు కింద అనేక చర్యలు చేపట్టామని, విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ నాడు - నేడు కింద పనులు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే దీని కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం పేర్కొ్న్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దుతాయని, వీటి కోసం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్ అసిస్టెన్స్‌ను వర్తింపు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. రేపు నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
AP SSC Exams: ఏపీలో రేపటి నుంచే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
Tirupati: గోవిందరాజస్వామి గుడిలో అపశ్రుతి, కూలిన చెట్టు, ఒకరి మృతి! ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !
Project K: ‘ప్రాజెక్ట్ కె’లో విలన్ పాత్రకు కమల్ అంత డిమాండ్ చేశారా? అసలు నిజం ఇది!