అన్వేషించండి

Rythu Bharosa: 'అన్నదాత బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి' - వైఎస్సార్ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్

CM Jagan: రాష్ట్రంలో అన్నదాత వేసే ప్రతీ అడుగులోనూ ప్రభుత్వం అండగా నిలిచిందని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా నిధులను బుధవారం రైతుల ఖాతాల్లో జమ చేశారు.

CM Jagan Credited Rythu Bharosa Funds: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. అందుకే ప్రభుత్వం వేసే ప్రతీ అడుగులోనూ అన్నదాతకు అండగా నిలిచామని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. బుధవారం వైఎస్సార్ రైతు భరోసా (Rythu Bharosa) పెట్టుబడి సాయం సొమ్మును.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. అలాగే, రబీ 2021 - 22, ఖరీఫ్ - 2022 సీజన్లకు గానూ అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. 'రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నాం. మొత్తం 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,078.36 కోట్లు జమ చేశాం. కౌలు రైతులకు, అటవీ, దేవాదాయ భూముల సాగు రైతులకు సాయం చేశాం. 57 నెలల్లో రైతు భరోసా కింద రూ.34,288 కోట్లు అందించాం. మేనిఫెస్టోలో చెప్పిన దాని కన్నా ఒక్కో రైతుకు అదనంగా రూ.17,500 ఇస్తున్నాం.' అని సీఎం వివరించారు.

'ఇది రైతు ప్రభుత్వం'

తమది రైతు ప్రభుత్వం అని సీఎం జగన్ అన్నారు. ‘ప్రభుత్వం వేసిన ప్రతీ అడుగూ కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలనే వేశాం. అన్నదాతకు అండగా పెట్టుబడి సాయం అందించాం. రాష్ట్రంలో దాదాపు 50 లోపు రైతులకు ఉన్న భూమి అర హెక్టార్ లోపలే. హెక్టార్ లోపల ఉన్న రైతులు 70 శాతం ఉన్నారు. ఈ పెట్టుబడి సాయం అన్నదాతలకు ఎంతో మేలు చేసింది. వంద శాతం మంది రైతులకు రైతు భరోసా కింద 80 శాతం ఖర్చు కవర్ అయ్యింది. సున్నా వడ్డీ కింద రూ.215.98 కోట్లు విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకూ 84.66 లక్షల మంది రైతులకు రూ.2,050 కోట్ల వడ్డీ రాయితీ అందించాం.’ అని జగన్ పేర్కొన్నారు.

'నాణ్యమైన ఉచిత కరెంట్'

19 లక్షల మంది రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ‘ఏడాదికి దాదాపు రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతుల తరఫున ఉచిత పంటల బీమాకు ప్రీమియం చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. రైతులకు ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను పెట్టాం. ఈ - క్రాప్ చేస్తూ అన్ని విధాలుగా వారికి అండగా ఉన్నాం. ఆక్వా రైతులకు రూ.1.5కే కరెంట్ ఇస్తూ చేయూత అందించాం. పాల సేకరణలోనూ రైతుకు తోడుగా నిలిచి వారికి మంచి ధర వచ్చేలా చేశాం.’ అని వివరించారు.

అలాగే, వివాదాలకు చెక్ పెట్టేలా సమగ్ర భూ సర్వే నిర్వహించామని సీఎం తెలిపారు. 34.77 లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులను రైతులు, పేదలకు కల్పించినట్లు చెప్పారు. వివిధ పథకాల ద్వారా రూ.1.2 లక్షల కోట్లు రైతన్నలకు అందించామని స్పష్టం చేశారు.

Also Read: Minister Ambati: అసెంబ్లీ ఎన్నికల ప్రచార 'సిత్రం' - టీ కాచి దోశలు వేసిన మంత్రి అంబటి రాంబాబు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Vijaya ghee issue: విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget