CM Jagan In Vizag : విశాఖలోనూ సీఎం జగన్ బుజ్జగింపులు - ధర్మశ్రీ , అవంతికి జిల్లా అధ్యక్ష పదవులు !
విశాఖలో మంత్రి పదవులు రాలేదని అసంతృప్తికి గురైన నేతలను సీఎం జగన్ బుజ్జగించారు. కరణం ధర్మశ్రీ, అవంతిశ్రీనివాస్‌కు జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఏపీ సీఎం, వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ( CM jagan ) ఎక్కడకు వెళ్లినా పార్టీ అసంతృప్తులను ఓదార్చడానికి సమయం కేటాయిస్తున్నాయి. తాజాగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం కోసం విశాఖ వచ్చిన సీఎం జగన్ ఎయిర్ పోర్టులోనే పార్టీ నేతలతో కొంత సేపు చర్చించారు. మొత్తంగా మంత్రి పదవి దక్కలేదని.. మంత్రి పదవిని తొలగించాలని అసంతృప్తికి గురైన వారిని ఓదార్చడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. మంత్రి పదవి దక్కలేదని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ( Karanam Dharma Sri ) కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అయింది. మీడియాతో కూడా ఆయన తన బాధ చెప్పుకున్నారు. దీంతో విశాఖ ఎయిర్‌పోర్టులో ధర్మశ్రీని జగన్ ఓదార్చారు. ఆయనకు పార్టీ పరంగా ప్రాముఖ్యతను ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడిగా చాన్సిస్తామని హామీ ఇచ్చారు.
జగన్‌కు బదులుగా పవన్ కల్యాణ్ - "ఆచార్య" ప్రీ రిలీజ్ వేడుకకు మారిన చీఫ్ గెస్ట్ !
అలాగే మంత్రి పదవి నుంచి తప్పించారని .. భఈమిలి ఎమ్మె్యే అవంతి శ్రీనివాస్ ( Avanti Srinivas ) అసంతృప్తిగా ఉన్నారు. కొత్త మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో ఆయన ముభావంగా ఉంటున్నారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను కూడా ఓదార్చారు. తొలగించిన మంత్రులకు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తామని ఇప్పటికే చెప్పారు. ఈ హామీలో భాగంగాఅవంతి శ్రీనివాస్‌కు విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చేందుకు జగన్ సంసిద్ధతం వ్యక్తం చేసిటన్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల్ని త్వరలో అమరావతికి పిలిపించి మాట్లాడిన తర్వాత జిల్లా అధ్యక్షులపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఆనం Vs అనిల్! ఆ పాత గొడవలు మళ్లీ మొదలవుతున్నాయా?
ప్రస్తుతం విశాఖ జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షునిగా గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఆయన మంత్రి కావడం...జిల్లాలు విడిపోవడంతో వీరిద్దరికీ చాన్స్ దక్కనుంది. విశాఖ పర్యటనలో సీఎం జగన్‌ను పలువురు పార్టీ ఎమ్మెల్యేలు నేతలు కలిశారు. వారందరితో సీఎం జగన్ కలివిడిగా మాట్లాడారు. గతంలో జగన్ పర్యటనకు వచ్చినప్పుడు ముందస్తు అనుమతి ఉన్న ఒకరిద్దర్ని మాత్రమేమాట్లాడేందుకు అనుమతి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు మాత్రం జగన్ వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని విశాఖ వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. విశాఖలో సీఎం జగన్ పర్యటన ఒకే ఒక్క కార్యక్రమంతో ముగిసింది. మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ ఒక్కటే అధికారిక కార్యక్రమం. మిగతావన్నీ ఎయిర్‌పోర్టులో ఆగినప్పుడు.. మళ్లీ వెళ్లేటప్పుడు పార్టీ నేతలతో మాట్లాడారు.