అన్వేషించండి

CM Chandrababu Konaseema Cyclone Arnab Loss: ఆర్నాబ్ తుఫాన్ బీభత్సం - ఏపీకి రూ. 4,600 కోట్ల నష్టం.. కోనసీమలో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన

Cyclone Arnab Damages AP: కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అర్నాబ్ తుఫాన్‌ వల్ల రూ.4,600 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏపీకి కేంద్ర బృందాలు వస్తున్నాయన్నారు.

Central Team Visit Andhra Pradesh Cyclone Damage:  ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని వణికించిన తీవ్ర ఆర్నాబ్  తుఫాన్ ధాటికి ప్రాథమిక అంచనాల ప్రకారమే రాష్ట్రానికి రూ. 4,600 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం, గచ్చకాయలపొర గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విపత్తు పరిస్థితులు మరియు సహాయక చర్యల వివరాలను ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు శుక్రవారం ఏపీకి రానున్నాయని సీఎం తెలియజేశారు.

గతంలో వచ్చిన హుదూద్, తిత్లీ, మొంతా తుఫాన్లు   మూడు దశాబ్దాల క్రితం నవంబర్ 6న సంభవించిన హరికేన్ విపత్తులను గుర్తుచేస్తూ.. గత అనుభవాలతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్లే ఈసారి ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని స్పష్టం చేశారు. విపత్తు వేళ ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం శ్రమించిందని, అయినప్పటికీ దురదృష్టవశాత్తూ ఏడుగురు మరణించడం బాధాకరమన్నారు. సముద్ర గర్భంలో తలెత్తే తుఫాన్లను ఆపలేమని, కానీ సమర్థవంతమైన యాజమాన్యంతో ఆస్తి, ప్రాణ నష్టాలను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా చర్యలను కొంతమంది రాజకీయం చేస్తూ ఎగతాళిగా మాట్లాడినా, యంత్రాంగం ఏమాత్రం అధైర్యపడకుండా ప్రజా సేవకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.   

తీవ్రంగా ప్రభావితమైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ ,  పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక్క కోనసీమ జిల్లాలోనే ఏకంగా 8,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినందున, విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నుండి 1,000 మంది సాంకేతిక సిబ్బందిని రప్పిస్తున్నామని తెలిపారు. అవసరమైతే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సాయం కూడా తీసుకుంటామన్నారు. ఆర్టీజీఎస్  , అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ల సహాయంతో రోడ్లపై కూలిన చెట్ల తొలగింపు, చెరువులకు గండ్లు పడకుండా నివారించడం , టెలీకమ్యూనికేషన్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేశామని వెల్లడించారు.

బాధితులకు ,  రైతాంగానికి అందించే సహాయక చర్యలపై సీఎం పూర్తి హామీ ఇచ్చారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్టుకు రూ. 1,500, ఆయిల్ పామ్ చెట్టుకు రూ. 1,500 చొప్పున పరిహారంతో పాటు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రతి కుటుంబానికి 25 కిలోల ఉచిత బియ్యం, నిత్యావసర సరుకుల ప్యాకెట్ మరియు తక్షణ వ్యయాల కోసం ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ముందస్తుగానే పంటల బీమా సౌకర్యం కల్పించినందున దిగుబడి తగ్గిన రైతులకు ఇన్సూరెన్స్ ద్వారా పూర్తి పరిహారం దక్కేలా చూస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల నష్టం అంచనాలు రాగానే నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు.

 విపత్తుతో ఆర్థికంగా నలిగిపోయిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని చంద్రబాబు అన్నారు.   గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోలేదని, తమ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత మంచినీటిని అందిస్తుందని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో బాధితులందరికీ పూర్తిస్థాయి పరిహారం చేరే వరకు, విద్యుత్ మరియు సాధారణ జీవనం పునరుద్ధరించబడే వరకు ప్రభుత్వం కడపటి బాధితుడి పక్షాన నిలబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmial Daughter Wedding: వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం.. నేడు క్రిస్టియన్, రేపు హిందూ సంప్రదాయంలో పెళ్లి!
వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం.. నేడు క్రిస్టియన్, రేపు హిందూ సంప్రదాయంలో పెళ్లి!
CM Chandrababu: పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, పైప్‌లైన్ ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, చర్యలకు ఆదేశం
పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, పైప్‌లైన్ ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, చర్యలకు ఆదేశం
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
YS Sharmila Daughters Wedding: నేడు వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. వివాహ వేదికను ఎక్కడికి మారింది, రిసెప్షన్ వివరాలు
నేడు వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. వివాహ వేదికను ఎక్కడికి మారింది, రిసెప్షన్ వివరాలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget