అన్వేషించండి

Modi Invitation To Babu : మరోసారి మోదీతో సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం - డిసెంబర్ 5న ఢిల్లీలో ఏం జరగనుంది?

డిసెంబర్ 5వ తేదీన మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. జీ 20 కూటమి సదస్సు నిర్వహణపై జరగనున్న సమావేశానికి చంద్రబాబును కేంద్రం ఆహ్వానించింది.

Modi Invitation To Babu :   తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశానికి మరోసారి ఆహ్వానం లభించింది. డిసెంబర్ 5వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు.  జీ-20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఈ సదస్సు నిర్వహణపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ చర్చించి.. సలహాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి  చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. అలాగే సమావేశ ప్రాధాన్యతను కూడా టీడీపీ అధినేతకు ప్రహ్లాద్ జోషి ఫోన్‌లో వివరించి హాజరు కావాల్సిందిగా కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. 

చంద్రబాబుకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి 

ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశానికి చంద్రబాబుకు రెండో సారి ఆహ్వానం అందింది.   ఇటీవల జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కూడా చంద్రబాబును కేంద్రం ఆహ్వానించింది. ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి ఆహ్వానం పలికారు.   జి-20 కూటమి దేశాలు ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 80 శాతాన్నీ, వాణిజ్యంలో 75 శాతాన్ని కలిగి ఉన్నాయి. అంటే దాదాపుగా ప్రపంచంలో మూడు వంతు దేశాలకు ఈ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది.ఈ సమావేశం నిర్ణయాల ద్వారా ప్రపంచంపై తనదైన ముద్ర వేయడానికి భారత్‌కు అవకాశం లభిస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు.

అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటున్న కేంద్రం

ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులనూ పిలుస్తున్నారా లేకపోతే.. కొంత మంది అనుభవం ఉన్న ఎంపిక చేసిన వారినే పిలుస్తున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. రాజకీయ పార్టీలతో ఓ సారి.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ అయి సూచనలు, సలహాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయాలకు సంబంధం లేని కార్యక్రమం.. ప్రపంచంలో భారత దేశ పరపతీని పెంచే కార్యక్రమం కావడంతో.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అన్ని రాజకీయ పార్టీల నేతలూ తమ సలహాలు.. సూచనలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఏపీలో రాజకీయ పరమైన చర్చ జరిగే అవకాశం 

ప్రధానమంత్రితో సమావేశానికి ఏపీ ప్రతిపక్ష నేతకు పిలుపు అంటే.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరమైన చర్యలు కూడా సాగుతాయి. ఎదుకంటే ఏపీలో రాజకీయాలు డైనమిక్‌గా మారిపోతున్నాయి. పొత్తుల గురించి చర్చలు నడుస్తున్నాయి. అందుకే.. సమావేశం కూడా హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. 2014లో ఎన్డీఏలో టీడీపీ ఉంది. 2018లో బయటకు వచ్చింది. ఆ తర్వాత మోదీని చంద్రబాబు ఒక్క సారిగా మాత్రమే కలిశారు. అది కూడా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో మాత్రమే కలిశారు.  తాజాగా మరోసారి ప్రధాని సమావేశానికి చంద్రబాబు హాజరు కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
First Flight Experience : మొదటిసారి విమానంలో ప్రయాణిస్తుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఆ విషయం అస్సలు మరచిపోకండి
మొదటిసారి విమానంలో ప్రయాణిస్తుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఆ విషయం అస్సలు మరచిపోకండి
AP Govt Good News ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
Embed widget