అన్వేషించండి

Chandrababu Naidu good news for handloom weavers: చేనేతలకు చంద్రబాబు గుడ్ న్యూస్ - ఏడో తేదీ నుంచి ఉచిత విద్యుత్

Free electricity scheme: చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం. బిల్లు కట్టాల్సిన పనిలేదు.

Free electricity scheme for handloom weavers:  సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి వర్తింపజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలుతో మరో ఎన్నికల హామీని సీఎం చంద్రబాబు అమలుచేసినట్లయింది. 2019-24 మధ్య అయిదేళ్ల పాటు ఆనాటి ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల చేనేత కార్మికులు అన్ని విధాలా నష్టపోయారు. 

ఇదే విషయం గుర్తించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్... చేనేత కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, చేనేతలకు లబ్ధి కలిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మగ్గాల మీద 50 వేల నేతన్నలు, మర మగ్గాలపై 11,500ల మంది ఆదారపడి జీవిస్తున్నారు. వారందరికీ ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500ల ఉచితంగా అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా రూ.125 కోట్ల మేర భారం పడనుంది.  ఉచిత విద్యుత్ పథకం వల్ల చేనేత కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు కలుగుతుంది.

నేత్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో రూ.10 వేల కోట్లతో నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చారు.  ఈ పాలసీ ద్వారా 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్ మొత్తం పెంచారు. మొదటి ఏడాది పెన్షన్ల రూపంలోనే రూ.370.89 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారు. చేనేతలకు త్రిఫ్ట్ పథకం కింద 2024-25లో రూ.5 కోట్లు, 2025-26లోనూ త్రిఫ్ట్ పథకానికి మరో రూ.5 కోట్లు కేటాయించారు. క్యాష్ క్రెడిట్ కార్డులతో సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు. నేటితరం అభిరుచులకు  అనుగుణంగా నూతన వస్త్రాల తయారీలో అయిదు జిల్లాల్లో నేతన్నలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. చేనేత వస్త్రాల విక్రయాలకు రాష్ట్రంతో పాటు దేశంలోని ఏడు నగరాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. 

ఆప్కో నేతృత్వంలో ఈ కామర్స్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే చేనేత వస్త్రాలను డెలివరీ చేస్తున్నారు. జాతీయ హ్యాండ్‌లూమ్ అభివృద్ధి ప్రోగ్రామ్ కింద 2024-25లో 10 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీవర్స్ ముద్రా స్కీమ్ ద్వారా చేనేతలకు రుణాలు అందజేశారు. ముడి పదార్థాల సరఫరా పథకం నూలుపై 15 శాతం సబ్సిడీ అందజేస్తున్నారు. విశాఖపట్నంలో రూ.172 కోట్లు యూనిటీ మాల్ నిర్మిస్తున్నారు. రాయదుర్గం, హిందూపురం, బ్రాండెక్స్లో టెక్స్ టైల్స్ పార్కుల అభివృద్ధితో పాటు ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్క్ కూడా నిర్మించబోతున్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ తోనూ ఒప్పందం చేసుకున్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చేనేత మహిళలకు రూ.10 వేలు విలువ చేసే నూలును అందజేస్తున్నారు. మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.  

టాప్ హెడ్ లైన్స్

Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
YS Jagan Delhi: జగన్ ఢిల్లీ రాజకీయం - మోదీ, అమిత్ షాలతో సమావేశానికి ప్రయత్నం - రాజకీయంగా మేలేనా !?
జగన్ ఢిల్లీ రాజకీయం - మోదీ, అమిత్ షాలతో సమావేశానికి ప్రయత్నం - రాజకీయంగా మేలేనా !?
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
Embed widget