అన్వేషించండి

Chandrababu : ఐదోసారి సీఎంగా వస్తా - అసెంబ్లీలో చంద్రబాబు కామెంట్స్ - పవన్ కోరిక మేరకేనా?

Andhra Pradesh: ఏపీకి ఐదో సారి తాను సీఎంగా వస్తానని చంద్రబాబు అసెంబ్లీ చివరి రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 4.0 గవర్నెన్స్‌ మొదటి దశలో ఉందన్నారు.

Chandrababu Fifth Time :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తాను ఐదో సారి సీఎంగా వస్తానని ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్ కోసం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు ఆయన మాట్లాడారు.తన విజన్ గురించి మాట్లాడిన తర్వాత ఐదో సారి సీఎంగా వస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా తనకు ఇది నాలుగో టర్మ్ అని.. 4.0లో  ఇప్పుడు మొదటి దశ మాత్రమే జరుగుతోందన్నారు. పాలనలో మరిన్ని సంచలనాత్మక మార్పులు వస్తాయన్నారు.        

రెండు రోజుల కిందట అసెంబ్లీలో మాట్లాడిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో పదేళ్ల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పని తీరుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చని  ప్రశంసించారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్నని దగ్గర ఉండి నడిపిన తీరు అభినందనీయమని తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు.         

Also Read:  'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పవన్ కల్యాణ్ సీఎం కావాలని జనసైనికులు కోరుకోవడం సహజమే.  ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా పవన్ సీఎం అవుతారని జనసైనికులు నమ్మకంతో ఉన్నారు. అయితే పవన్ మాత్రం రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని అంటున్నారు. అందుకే చంద్రబాబు సీఎంగా ఆ తర్వాత కూడా మరో పదేళ్లు కొనసాగాలని ప్రకటించేశారు. చంద్రబాబు కూడా చంద్రబాబు 5.0 ఉంటుందని చెప్పారు. అంటే కూటమిలో ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదని చెప్పడానికి ముఖ్య నేతలు కావాలనే ఇలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

నిజానికి చంద్రబాబు 4.0 ఏర్పడి ఐదు నెలలే అయింది. వచ్చే ఎన్నికల గురించి వచ్చే ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన పనిలేదు. ఓటమి తర్వాత వైసీపీ పదే పదే ఇబ్బందులకు గరువుతూండటంతో పాటు జగన్ మోహన్ రెడ్డి ఇక రాజకీయంగా కోలుకోలేరన్న అభిప్రాయం బలంగా ఉండటంతో కకూటమి నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అనుకోవచ్చని అంటున్నారు. 

Also Read: Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2 Collection: ఇండియన్  బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2 Collection: ఇండియన్  బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
Anantapuram News: అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Crime News: ఒకే రోజు 2 ఘోర ప్రమాదాలు - 12 మంది దుర్మరణం, యూపీలో తీవ్ర విషాదం
ఒకే రోజు 2 ఘోర ప్రమాదాలు - 12 మంది దుర్మరణం, యూపీలో తీవ్ర విషాదం
Viral News: విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !
విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !
Embed widget