News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఏ 8 నిందితుడని కోర్టుకు సీబీఐ తెలిపింది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్‌లో కీలక విషయాలు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

YS Viveka  Case :  మాజీ మంత్రి వివేకానందరెడ్డి  హత్య కేసులో .. ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఇప్పటి వరకూ నిందితుడిగా ఎక్కడా చెప్పలేదు. తొలిసారిగా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్ లో అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చింది.  హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరివివేతలో కీలకంగా వ్యవహరించారని సీబీఐ కౌంటర్ లో తెలిపింది. భాస్కర్ రెడ్డికి  బెయిల్ ఇస్తే.. దర్యాప్తు, సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తారని సీబీఐ కౌంటర్ లో తెలిపింది. భాస్కర్ రెడ్డి పులివెందులలో చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని ... ఆయనకు బెయిల్ ఇవ్వవొద్దని కోరింది. 

బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుందన్న సీబీఐ                     

భాస్కర్ రెడ్డిని  అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేశారని.. ఆయన బయట ఉంటే.. పులివెందుల సాక్షులు ప్రభావితమైనట్లేనని కౌంటర్ లో సీబీఐ స్పష్టం చేసింది. బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. విచారణకు సహకరిస్తున్నామని భాస్కర్ రెడ్డి చెబుతున్నారని..కానీ అదంతా అబద్దమన్నారు.    శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ రెడ్డి హత్యాస్థలానికి చేరుకున్నారని అంతకు ముందే .. గంగిరెడ్డి, శివంకర్ రెడ్డి , అవినాష్ రెడ్డి మాట్లాడుకున్నారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారన్నారు. కేసు పెట్టవద్దని.. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు  అవినాష్ , శివశంకర్ రెడ్డి చెప్పారన్నారు. సీబీఐ , కోర్టుకు ఏమీ చెప్పవద్దని దస్తగిరిని ప్రలోభపెట్టారని సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో భారీ కుట్ర ఉందని దానిపై దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ తెలిపింది.   

కౌంటర్‌లో మరోసారి సీఎం జగన్ ప్రస్తావన

హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ.. దాఖలు చేసిన కౌంటర్ లో సీబీఐ సీఎం జగన్ ప్రస్తావన తీసుకు వచ్చింది. వైఎస్ వివేకా హత్యకు గురయ్యారని  బయట ప్రపంచానికి తెలియక ముందే .. సీఎం జగన్ తెలుసని కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా సీబీఐ కోర్టులోనూ చెప్పింది. దీంతో మరోసారి జగన్ ప్రస్తావనను సీబీఐ తెచ్చినట్లయింది. 

అనారోగ్యం కారణంగా బెయిలివ్వాలని భాస్కర్ రెడ్డి వాదనలు                 

భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు వాదనలు వినిపించారు.  భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును న్యాయవాది ప్రస్తావించారు.  వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని సీబీఐ అధికారులు ఆరెస్ట్ చేశారని న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు అన్నారు. ఆరోపణలు మాత్రమే సీబీఐ పరిగణలోకి తీసుకుందని, భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకబడి ఉన్న వ్యక్తి అని, ఒక సీనియర్ సిటిజన్‌ను అక్రమ కేసులో ఇరికించారన్నారు. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి అని, ఆయన నేరం చేశారనడానికి ఎక్కడా సరైన సాక్ష్యాలు లేవన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదని అన్నారు. 

లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సునీత లాయర్‌కు కోర్టు ఆదేశం                   
        
ఈ కేసు విషయంలో ఇంప్లీడ్ అయ్యేందుకు గతంలో వైఎస్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయమూర్తి అంగీకరించారు. అయితే లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలన్నారు. తదుపరి విచారణను తొమ్మిదో తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.  

Published at : 08 Jun 2023 04:34 PM (IST) Tags: YS Avinash Reddy YS Bhaskar Reddy YS Viveka Case Bhaskar Reddy bail petition hearing

ఇవి కూడా చూడండి

Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు

Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ

Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ

Vadde Sobhanadreeswararao: జగన్ పైశాచికానందం కోసమే బాబుపై సీఐడీ కేసు, ఇక మారకపోతే పతనమే: మాజీ మంత్రి

Vadde Sobhanadreeswararao: జగన్ పైశాచికానందం కోసమే బాబుపై సీఐడీ కేసు, ఇక మారకపోతే పతనమే: మాజీ మంత్రి

టాప్ స్టోరీస్

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?