News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Viveka Murder Case: వివేకాహత్య కేసులో భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు, కొద్ది రోజులకే అనుమతి

12 రోజుల పాటు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు బెయిల్ కు సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ కు అనుమతించింది.

FOLLOW US: 
Share:

వివేకాహత్య కేసులో భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. 12 రోజుల పాటు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు బెయిల్ కు సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ కు అనుమతించింది. అనారోగ్యం కారణంగా భాస్కర్ రెడ్డి బెయిల్ కోరగా, కోర్టు అందుకు అనుమతించింది.

ఏప్రిల్‌ 16న అరెస్టు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఏప్రిల్ 16న అరెస్టు చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంటికి ఏప్రిల్ 16 తెల్లవారుజామునే రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు 10 మందికి పైగా వెళ్లి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా అప్పుడు అదుపులోకి తీసుకున్నారు. 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదు అయింది. 120బి రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హత్య అనంతరం సాక్ష్యాధారాల ధ్వంసంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ అధికారులు అభియోగం మోపారు. వివేకా హత్య కేసులో ఒక కుట్రదారుడిగా భాస్కర్ రెడ్డిపై అభియోగాలు మోపారు. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా తొలుత ప్రచారం జరిగిందని, ఆ గుండెపోటు ప్రచారంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా ఆరోపించారు. హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్లుగా ఆధారాలు గురించినట్లుగా సీబీఐ అధికారులు అప్పట్లో తెలిపారు.

బెయిల్ కోసం పిటిషన్లు

జూన్ నెలలో భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును న్యాయవాది ప్రస్తావించారు.  వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని సీబీఐ అధికారులు ఆరెస్ట్ చేశారని న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు అన్నారు. 

బెయిల్ పిటిషన్ కొట్టివేత

వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను జూన్ నెలలో సీబీఐ కోర్టు కొట్టి వేసింది. భాస్కర్ రెడ్డి అత్యంత ప్రభావిత వ్యక్తి అని, బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని.. సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐతో పాటు వివేకా కుమార్తె సునీత చేసిన వాదనలను సీబీఐ కోర్టు జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు. 

ఈ నెలలోనూ బెయిల్ తిరస్కరణ

ఈ సెప్టెంబరు 4న కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణలో భాగంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్ పిటిషన్ ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు కొద్ది రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది.

Published at : 20 Sep 2023 06:19 PM (IST) Tags: CBI Court Viveka Murder Case Vivekananda reddy Murder Case YS Bhaskar Reddy

ఇవి కూడా చూడండి

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Income Tax: మీ పాత ఇంటిని అమ్ముతున్నారా?, ఎంత టాక్స్‌ కట్టాలో ముందు తెలుసుకోండి

Income Tax: మీ పాత ఇంటిని అమ్ముతున్నారా?, ఎంత టాక్స్‌ కట్టాలో ముందు తెలుసుకోండి

Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vizag Pawan Kalyan :  ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Anantapur News: అనంతపురంలో సైబర్ క్రైమ్! రూ.300 కోట్లకు పైగా లావాదేవీలు?

Anantapur News: అనంతపురంలో సైబర్ క్రైమ్! రూ.300 కోట్లకు పైగా లావాదేవీలు?

andhra Caste Census Postpone : ఏపీలో కులగణన మళ్లీ వాయిదా - భారీ వర్షాలే కారణం !

andhra Caste Census Postpone : ఏపీలో కులగణన మళ్లీ వాయిదా - భారీ వర్షాలే కారణం  !

టాప్ స్టోరీస్

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!