By: ABP Desam | Updated at : 31 Aug 2023 02:58 PM (IST)
జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి
CBI Court: విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టుకున్న పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇద్దరూ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ ఏ 1, ఏ 2 నిందితులుగా ఉన్నారు. గతంలో సీబీఐ అరెస్ట్ చేయడంతో బెయిల్ పై బయటకు వచ్చారు. బెయిల్ షరతుల్లో పాస్ పోర్టు కోర్టుకు సరెండర్ చేయాలని.. కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లాలన్న నిబంధన ఉంది. ఈ కారణంగా వారిద్దరి పాస్ పోర్టు కోర్టు అధీనంలో ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి తీసుకుంటూ ఉంటారు. తాజాగా జగన్, విజయసాయిరెడ్డి వేర్వేరుగా విదేశీ పర్యటనలకు వెళ్లాలని పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి యూకే కు వ్యక్తిగత పర్యటనకు వెళ్లానున్నారు. సెప్టెంబర్ రెండు నంచి పన్నెండో తేదీ వరకూ ఆయన యూకే పర్యటనలో ఉండనున్నారు. యూకేలో సీఎం జగన్ కుమార్తెలు చదువుకుంటున్నందున.. వారి దగ్గర కొంత కాలం గడిపి రావాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా వ్యక్తిగత పర్యటన కోసం దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు. ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చే ఆరు నెలల కాలంలో నెల రోజుల పాటు విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయిరెడ్డికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.
అయితే వీరిద్దరి విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టులో వాదించింది. జగన్, సాయిరెడ్డి దాఖలు చేసిన అభ్యర్థనలను తిరస్కరించాలని సిబిఐ విజ్ఞప్తి చేసింది. విదేశీ టూర్‌కు అనుమతివ్వొద్దని, సాక్షులను వీరు ప్రభావితం చేసే అవకాశముందని పీపీ కోర్టుకు వివరించారు. అయితే సీబీఐ కోర్టు నుంచి జగన్, విజయసాయిరెడ్డిలకు అనుకూలమైన నిర్ణయం వచ్చింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రో కోకు పాల్పడినట్లుగా జగన్ తో పాటు విజయసాయిరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. పెన్నెండేళ్లు దాటినా ఇంకా ఆ కేసులు విచారణ దశలోకి రాలేదు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిందితులు డిశ్చార్జి పిటిషన్ల వేస్తూండటంతో విచారణ సుదీర్ఘంగాసాగుతోంది. ఇప్పటికే సీబీఐ 8 ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ముగిసింది. మరో 3 ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఈడీ ఏడు ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ముగిసింది. మరో నాలుగు ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. విచారణ జాప్యమయ్యేలా నిందితులు కావాలనే ఒకరి తర్వాత ఒకరు డిస్చార్జ్ పిటి,న్లు వేస్తున్నారని సీబీఐ ఆరోపిస్తోంది.
Visakha News: వెయ్యి మంది మహిళలతో నారీ శక్తి సమ్మేళనం - అక్టోబర్ 1న ముహూర్తం ఫిక్స్
Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ
Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
Top Headlines Today: రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు! - డీకే శివకుమార్‌ను కలిసిన మోత్కుపల్లి
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
/body>