By: ABP Desam | Updated at : 18 May 2022 11:42 PM (IST)
బొజ్జల ఇంట్లో మరో విషాదం
Bojjala Harinath Reddy Dies: ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు బొజ్జల హరినాథ్ రెడ్డి బుధవారం రాత్రి మరణించారు. బుధవారం సాయంత్రం స్నానానికి వెళ్లిన హరినాథ్ రెడ్డి బాత్రుంలో జారిపడ్డారు. ఈ క్రమంలో హరినాథ్ రెడ్డికి గాయాలు కాగా, ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరినాథ్ రెడ్డి తుది శ్వాస విడిచారు. కాగా, ఈనెల 6 న కన్నుమూసిన మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియలు బుధవారం నాడు నిర్వహించారు. సరిగ్గా ఇదే రోజు ఆయన తమ్ముడు హరినాథ్ రెడ్డి చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మే 6న బొజ్జల కన్నుమూత..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ( Bojjala Gopala Krishna Reddy ) మే 6న తుది శ్వాస విడిచారు. కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకు అనారోగ్యం తీవ్రం కావడంతో పూర్తిగా మంచానికే పరిమితయ్యారు. ఆయన పరిస్థితి విషమించడంతో వారం క్రితం అపోలో ఆస్పత్రిలో ( Appllo Hospital ) చేర్పించారు. చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్లుగా వైద్యులు నిర్దారించారు.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు మిత్రుడు. చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్లు జరిపిన దాడిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గాయపడ్డారు. ఆ గాయాలకు ఆయన చాలా కాలం పాటు చికిత్స తీసుకున్నారు. పలు ఆపరేషన్లు కూడా చేయించుకోవాల్సి వచ్చింది. గత నెలలో బొజ్జల పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు ఇతర సన్నిహితులతో ఆయన ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించారు. ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్, మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆత్మీయ మిత్రులుగా ఉండేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా పలు సందర్భాలలో కేసీఆర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మధ్య ఆత్మీయ సమావేశాలు జరిగాయి.
Also Read: Bojjala Dead : టీడీపీ సీనియర్ నేత బొజ్జల కన్నుమూత !
Also Read: Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు
Breaking News Live Telugu Updates: కర్నూలులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం, కిట్లు పంపిణీ చేస్తున్న సీఎం
CM Jagan Speech: ఏపీలో విద్యార్థులకు ఫ్రీగా ట్యాబ్‌లు, ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం జగన్ - విద్యాకానుక కిట్ల పంపిణీ
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్
No Admissions In Govt School: సీఎం రికమండేషనైనా చెల్లదు- ఆ ప్రభుత్వ బడిలో చేరాలంటే ఎంట్రన్స్ రాయాల్సిందే!
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భారత ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు