News
News
X

AP BJP : ఇన్ని వర్షాలు పడినా సీమకు నీళ్లేవి ? - ప్రాజెక్టులపై చేసిన ఖర్చెంతో చెప్పాలన్న ఏపీ బీజేపీ !

రాయలసీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేసింది. సీమ ప్రాజెక్టులకు పైసా ఖర్చు పెట్టడం లేదని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.

FOLLOW US: 

AP BJP :రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అయితే ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టకపోవడం , వాటిని రైతుల కోసం ఆ నీటినివినియోగం చేయలేకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి  విమర్శలు గుప్పించారు.  బుధవారం తిరుపతిలో మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్‌‌ కు చిత్తశుద్ధి లేదన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్ గారు సాగునీటి ప్రాజెక్టులపై 3సం.లో ఖర్చు పెట్టింది ₹15393 కోట్లు ఈ విధంగా మీరు సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టినట్లయితే రానున్న 25 సంవత్సరాలు కూడా రాష్ట్రం లో ప్రాజెక్టులు పూర్తి కావు. రైతుల కల నెరవేరదు అన్నారు .

రివర్స్ టెండర్లు పేరుతో  కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. హంద్రీనీవా, గాలేరు, నగరి వంటి తోటపల్లి , లాంటి ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా రైతులకు ద్రోహం చేశారన్నారు. ప్రాజెక్టుల కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నాం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసిందా అని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 38 నెలల మీ పాలనలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్రంపై నెట్టి వైకాపా ప్రభుత్వం చేసిన తప్పుల నుండి తప్పించుకునేందుకు జగన్ సర్కార్ ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. 

రహదార్ల నిర్మాణాలకు సంబంధించి, జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.  జాతీయ , అంతర్జాతీయ నిధులు ఉపయెూగం చేసుకోలేదని , దీని కారణంగా రోడ్లు , రైల్వే , ఇతర ముఖ్యమైన ప్రాజక్టులు వీరి నిర్లక్ష్యం , ఫలితంగా రాష్ట్రం 25 సంవత్సరాల వెనుకకు పోతుందని , ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేక అంతర్జాతీయ స్థాయిలో తక్కువ వడ్డీకి యన్, డి, బీ  బ్యాంకు నిధులు సైతం రెండో దశ ను వదులుకునేది సిద్ధం కావడం దారుణం అన్నారు .

మొదటి దశలో రెండు వేల కోట్లకు టెండర్లను ఈ ప్రభుత్వం పిలిస్తే 18 నెలల కాలంలో 50 కోట్ల రూపాయలు మాత్రమే పనులు చేశారు అంటే ఈ ప్రభుత్వానికి రాష్ట్ర రోడ్లు పట్ల ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుంది . ఎన్ డి భి నిధులు వినియోగించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా వెుత్తం చెల్లించాలి .  రాష్ట్రం వాట చెల్లించలేక నేడు  రాష్ట్రంలో రహదారుల నిర్మాణం ఆగిపోయింది ప్రభుత్వం ఈ విషయంలో అని కాదని నిరూపించగలరా అని అయన ప్రశ్నించారు . 52 మంది  ఎమ్మెల్యేల కు 48 మంది ని , 8 ఎంపీలకు ఎనిమిది మంది గెలిపించిన పాపానికిసీమకు ద్రోహం చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు.  భవిష్యత్లో  సాగునీటి కోసం బీజేపీ నాయకత్వంలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. బీజేపీ, జనసేన తో కలిసి పని చేస్తుందన్నారు. రాయలసీమ , ఉత్తరాంద్రలో నెలకొన్న సమస్యలపై త్వరలో పెద్దఎత్తున పోరాటం చేస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Published at : 17 Aug 2022 06:18 PM (IST) Tags: Vishnuvardhan Reddy AP BJP Rayalaseema Projects Galeru Nagari Handri Neeva

సంబంధిత కథనాలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Minister Ambati Rambabu : మమ్మల్ని వేలు పెట్టి చూపించే అర్హత హరీశ్ రావు, కేసీఆర్ కు లేదు - మంత్రి అంబటి

Minister Ambati Rambabu : మమ్మల్ని వేలు పెట్టి చూపించే అర్హత హరీశ్ రావు, కేసీఆర్ కు లేదు - మంత్రి అంబటి

బస్సుల్లోనే రండి- శ్రీవారి భక్తులకు పోలీసుల విజ్ఞప్తి!

బస్సుల్లోనే రండి- శ్రీవారి భక్తులకు పోలీసుల విజ్ఞప్తి!

ఏడుగురిని పెళ్లాడిన మహిళ, చివరకు ఏమైందంటే?

ఏడుగురిని పెళ్లాడిన మహిళ, చివరకు ఏమైందంటే?

టాప్ స్టోరీస్

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం