Andhra Pradesh Pensions : ఏపీలో పెన్షన్ల పండుగకు ఏర్పాట్లు పూర్తి - ఉదయమే ప్రారంభించనున్న చంద్రబాబు - ఈ సారి ఎవరింటికి అంటే ?
Chandrababu: ఏపీలో సామాజిక పెన్షన్లను ఒకటో తేదీనే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మడకశిర నియోజకవర్గంలో చంద్రబాబు లబ్దిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు.
![Andhra Pradesh Pensions : ఏపీలో పెన్షన్ల పండుగకు ఏర్పాట్లు పూర్తి - ఉదయమే ప్రారంభించనున్న చంద్రబాబు - ఈ సారి ఎవరింటికి అంటే ? Arrangements have been completed to Distribute social pensions in AP Chandrababu Andhra Pradesh Pensions : ఏపీలో పెన్షన్ల పండుగకు ఏర్పాట్లు పూర్తి - ఉదయమే ప్రారంభించనున్న చంద్రబాబు - ఈ సారి ఎవరింటికి అంటే ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/31/de6dbd5633e8bcc903b737300427012f1722427169460228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh Pensions Distributions : ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో నెల సామాజిక పెన్షన్లను ఒకటో తేదీన ఉదయమే పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పెంచిన పెన్షన్ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచించారు. ఈ మేరకు అన్ని చోట్లా ప్రజాప్రతినిధులు భాగమయ్యేందుకు సన్నాహాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు మడకశిర మండలం గుండుమలలో లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పింఛన్లు అందజేయనున్నారు. మల్బరీ నాట్లు, పట్టు పురుగుల షెడ్లను కూడా పరిశీలిస్తారు. కరియమ్మదేవి ఆలయాన్ని సందర్శించి, గ్రామస్థులతో సీఎం మాట్లాడనున్నారు.
64. 82 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,737.41 కోట్లను ఇప్పటికే బ్యాంకుల నుంచి విడుదల చేసి.. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వేల్ఫేర్ ఆఫీసర్లకు చేర్రా.ు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 64. 82 లక్షల మందికి గురువారం ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి 1వ తేదీన 96 శాతం, 2న 100 శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వఅద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు అందిస్తున్నారు.
జూలై ఒకటిన కూడా స్వయంగాపెన్షన్లు అందించిన చంద్రబాబు
జూలై ఒకటో తేదీన గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి చంద్రబాబు పింఛన్ అందజేశారు. పాముల నాయక్‌కు వృద్ధాప్య పింఛన్, ఆయన భార్యకి కూడా రాజధానిలో భూమిలేని వారికి ఇచ్చే పింఛన్, కూతురు సాయికి వింతంతు పింఛన్ అందజేశారు. పింఛన్ పంపిణీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామంలోని మసీదు సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్‌తోపాటు మూడు నెలల బకాయిలను కూడా అందజేసినట్టు చెప్పారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను చదివించుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు చంద్రబాబు. తాను తొలి పింఛన్ ఇచ్చిన కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంని హామీ ఇచ్చారు. చుట్టూ పక్కా భవనాలు ఉంటే ఈ ఒక్క కుటుంబం మాత్రం పూరిగుడిసెలో ఉందని చెప్పారు. తర్వాత వారం రోజుల్లోనే ఇంటి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యేలా చూశారు.
చంద్రబాబు నాలుగు వేల పెన్షన్ ను ఎన్నికల హామీగా ఇచ్చారు. వెంటనే అమలు ప్రారంభించారు. గత మూడు నెలల బకాయిలుతో కలిసి ఏడు వేల రూపాయలు గత నెలలో పంపిణీ చేశారు. ఈ నెల నుంచి ఒక్కొక్కరికి నాలుగు వేల పెన్షన్ అందనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)