అన్వేషించండి

ఈ 25 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్‌! ఆస్పత్రుల నిర్ణయంతో ప్రజలకు షాక్

రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధమయ్యాయి. ఈ నెల 25 నుంచి ఆరోగ్య నెట్వర్క్‌ ఆస్పత్రుల్లో సేవలు అందించబోమని అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు.

Arogya Sri Services Close: రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధమయ్యాయి. ఈ నెల 25 నుంచి ఆరోగ్య నెట్వర్క్‌ పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలు అందించబోమని అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి జిల్లాలోనూ నెట్వర్క్‌ ఆస్పత్రులకు రూ.50 నుంచి రూ.100 కోట్ల మేర ప్రభుత్వం బకాయి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేయి కోట్లకుపైగా బిల్లులను పెండింగ్‌లో పెట్టింది.

గత నెలలో సేవలు బంద్‌ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యాలు హెచ్చరించడంతో కొంత వరకు పెండింగ్‌ బకాయిలు ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని డిసెంబరు 31లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ రోజులు గడుస్తున్నా నెరవేరకపోవడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు సుమారు 500 వరకు ప్రైవేటు ఆస్పత్రులు నెట్వర్క్‌ పరిధిలో ఉన్నాయి. వీటిన్నింటిలోనూ గురువారం ఉదయం నుంచి కొత్తగా వచ్చే రోగులకు వైద్య సేవలను అందించారు. రోగుల రిజిస్ర్టేషన్లు కూడా ప్రారంభించమని ఆస్పత్రులు ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌ బకాయిలను క్లియర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. బకాయిలు క్లియర్‌ చేస్తేనే సేవలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేస్తున్నారు. 

రోగులకు తీవ్ర ఇబ్బందులు

నెట్వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపేయడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ప్రతిరోజూ ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా నెట్వర్క్‌ ఆస్పత్రుల్లో కనీసం ఐదారు వేల మంది కొత్త రోగులు వైద్య సేవల కోసం చేరుతుంటారు. వీరంతా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్యవసర వైద్య సేవల సంగతి ఏమిటన్నదానిపైనా ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టత ఇవ్వలేదు. అత్యవసర శస్త్ర చికిత్సలను ఆరోగ్య శ్రీ పథకంలో చేయకుండా నిలిపేస్తే రోగులు మరింత ఇబ్బందిపడే అవకాశముంది. దీనిపై ప్రభుత్వం తక్షణమే తగిన నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Green Chairman: ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాగబాబు! పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణ ప్రణాళిక రూపకల్పనే ధ్యేయమని ప్రకటన!
ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాగబాబు! పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణ ప్రణాళిక రూపకల్పనే ధ్యేయమని ప్రకటన!
Ongole Radisson Hotel:100 కోట్లతో ఒంగోలు సమీపంలో 5-స్టార్ హోటల్‌-మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!
100 కోట్లతో ఒంగోలు సమీపంలో 5-స్టార్ హోటల్‌-మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!
DWCRA Tea Coffee Centres: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
AP Water Projects: ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Rakhi Celebrations: పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
DWCRA Tea Coffee Centres: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
Ongole Radisson Hotel:100 కోట్లతో ఒంగోలు సమీపంలో 5-స్టార్ హోటల్‌-మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!
100 కోట్లతో ఒంగోలు సమీపంలో 5-స్టార్ హోటల్‌-మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!
AP Water Projects: ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
Maharashtra Crime News: శ్రావణ మాసంలో మటన్ తినాలనుకున్నందుకు కొడుకును చంపిన తండ్రి! సాక్ష్యాలు ధ్వంసం చేసిన తల్లి!
శ్రావణ మాసంలో మటన్ తినాలనుకున్నందుకు కొడుకును చంపిన తండ్రి! సాక్ష్యాలు ధ్వంసం చేసిన తల్లి!
Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా కమ్ బ్యాక్ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రోజా కమ్ బ్యాక్ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget