అన్వేషించండి

APSRTC: దసరా పండుగ - ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

Andhra News: దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అక్టోబర్ 3 నుంచి 15 వరకూ మొత్తం 964 సర్వీసులు తిప్పిేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

APSRTC Special Buses: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను (Special Services) నడుపుతామని ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకూ శరన్నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరాలకు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, బెంగుళూరు, చెన్నై నగరాలకు బస్సులు నడపనున్నారు. మొత్తం 934 సర్వీసులు తిప్పేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈసారి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 353 బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. రాజమహేంద్రవరానికి 241, విశాఖకు 90, బెంగుళూరుకు 14, చెన్నైకు 22, ఇతర ప్రాంతాలకు 244 బస్సులను నడపనున్నారు. తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సైతం 30 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 15 వరకూ 13 రోజుల పాటు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. అలాగే, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు, అక్టోబర్ 16న అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. 

భారీగా ఆదాయం

ఉద్యోగ, ఉపాధి నిమిత్తం భాగ్యనగరంలో ఉన్న వారు ప్రతి ఏటా దసరా, సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు పయనమవుతుంటారు. ఈ క్రమంలో వారి సౌలభ్యం నిమిత్తం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అటు, రైల్వే శాఖ సైతం దసరా ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రతి ఏటా పండుగ సమయాల్లో ఆర్టీసీకి అధిక ఆదాయం వస్తోంది. ఈసారి కూడా భారీగానే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది దసరా ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.2.35 కోట్ల ఆదాయం సమకూరింది. కొవిడ్ తర్వాత ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. అప్పుడు మొత్తం 950 బస్సులను 5.30 లక్షల కిలోమీటర్ల మేర తిప్పారు. కిలో మీటరుకు రూ.44.36 మేర రాబడి వచ్చింది. హైదరాబాద్ - విజయవాడ మార్గంలో నడిచే సర్వీసుల ద్వారా గరిష్టంగా రూ.1.08 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత విశాఖ రూట్‌లో రూ.75.52 లక్షలు వచ్చింది. 

Also Read: Tirupati Laddu Row:బయటకి రావద్దని జగన్‌కి రాజాసింగ్ సలహా- తిరుమలేశుడికి లేఖ రాసిన మాధవీ లత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget