అన్వేషించండి

YS Sharmila: 'అన్న అనుకున్న వాడే హంతకులకు రక్షణగా ఉన్నారు' - ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Andhra News: వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటివరకూ దోషులకు శిక్ష పడలేదని.. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

APCC Chief Sharmila Sensational Comments: వైఎస్ వివేకా హత్య కేసులో హంతకులు ఎవరో కాదని.. బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. మాజీ మంత్రి వివేకా ఐదో వర్థంతి సందర్భంగా కడపలో శుక్రవారం నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. 'అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు. చిన్నాన్న వైఎస్ వివేకా మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీత. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటివరకూ హత్య చేసిన, చేయించిన వారికి శిక్ష పడలేదు. చిన్నాన్న చివరి క్షణం వరకూ వైసీపీ కోసమే పని చేశారు. అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తారా.?. సాక్షిలో పైన వైఎస్ ఫోటో.. కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వంపై నిందలు వేశారు. జగనన్నా.. అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా.? ఆయన వారసుడిగా మీరేం చేశారు. ఇది ఆస్తి, అంతస్తు కోసం జరుగుతున్న పోరాటం కాదు. న్యాయం కోసం పోరాటం. ప్రజలంతా ఓ నిర్ణయం తీసుకోవాలి.' అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.

'సునీతకు అండగా ఉంటా'

'వైఎస్ వివేకా ఒక మంచి మనిషి. వివేకాది అద్భుతమైన వ్యక్తిత్వం. సునీత నేను కలిసే పెరిగాం. చిన్నాన్న నన్ను ఆఖరిగా కలిసినప్పుడు ఎంపీగా పోటీ చేయాలని అడిగారు. నేను వద్దన్నా వినకుండా.. నన్ను ఒప్పంచి మరీ వెళ్లారు. ఆయన చనిపోయి 5 ఏళ్లు గడించింది. ఆయన మరణం ఇప్పటికీ నమ్మలేని నిజం. రాజకీయ విష సర్పాల కోరల్లో చిక్కుకుని... దుర్మార్గపు పాలన చక్రాల కింద నలిగి.. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్న ఓ నిప్పులాంటి నిజం. వివేకా హత్య కేసులో నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. అంతటి వ్యక్తికే న్యాయం జరగలేదంటే, సమాజంలో మిగతా వారి పరిస్థితి ఏంటి.?. అన్నా అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణ గా ఉన్నాడు. అందుకే న్యాయం జరగలేదు. తోడబుట్టిన చెల్లెళ్లు అని చూడకుండా అవమానాలకు గురి చేసినా తట్టుకున్నాం. సునీత కుటుంబం హత్య చేసి ఉంటే మీరు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు.?. డాక్టర్ గా సునీతకు ఓ స్థానం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ పేరు ఉంది. సునీతకు, చిన్నమ్మ కి మాట ఇస్తున్నా. ఎవరు ఉన్నా లేకున్నా... వైఎస్సార్ బిడ్డ మీకు అండగా ఉంది. సునీత పోరాటానికి నేను బలం అవుతా. ఇది ఆస్తి, అంతస్తు కోసం కాదు. న్యాయం జరగాలని కొట్లాడుతున్న ఓ బిడ్డ కోసం పోరాటం. ప్రజలంతా న్యాయం పక్షాన నిలబడాలని ఓ నిర్ణయం తీసుకోవాలి. హత్యా రాజకీయాలను ఛీ కొట్టి ఓ గుణపాఠం చెప్పాలి.' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: Chandrababu: 'రాష్ట్ర యువత ఆశలు చంపేశారు' - ఏపీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget