అన్వేషించండి

AP Rains: ఏపీపై ఉపరితల ద్రోణి ప్రభావం.. గురువారం ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

AP Rains: ఉపరితల ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తిరుపతి, విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో వర్షపాతం నమోదు.

AP Rains: ఏపీలో ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా మారింది. మన్నార్ గల్ఫ్, నైరుతి బంగాళాఖాతం మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల తోడవ్వడంతో రాబోయే సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.  ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.  

 గురువారం (15-10-2026) వర్ష సూచన 

గురువారం రాష్ట్రంలోని ప్రధాన జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉనట్లు ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.   

మోస్తరు వర్షాలు కురిసే జిల్లాలు 

మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.  

మిగతా జిల్లాల్లో 

రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.    

Also Read: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే- అమల్లోకి ఎలక్షన్ కోడ్

నమోదైన వర్షపాతం 

బుధవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన ప్రధాన వర్షపాత వివరాలను ఏపీఎస్‌డీఎంఏ వెల్లడించింది. 

  1. తిరుపతి జిల్లా: కలుగుర్తిపాడులో 39.9 మి.మీ, చిట్టమూరులో 39.4 మి.మీ, కొత్తగుంటలో 33.6 మి.మీ వర్షపాతం నమోదైంది. 
  2. విశాఖపట్నం జిల్లా: పద్మనాభంలో 35.2 మి.మీ.   
  3. విజయనగరం జిల్లా: డెంకాడలో 29.7 మి.మీ.   
  4. నెల్లూరు జిల్లా: అల్లంపాడులో 28 మి.మీ, చింతవరం, గూడూరులలో 26 మి.మీ చొప్పున వర్షపాతం పడింది. 
  5. అనకాపల్లి జిల్లా: సబ్బవరంలో 27.5 మి.మీ నమోదు అయింది. 

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులతో పాటు తీరప్రాంత ప్రజలు, ప్రయాణికులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Also Read: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన

Frequently Asked Questions

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎవరు అప్రమత్తంగా ఉండాలి?

రైతులు, తీరప్రాంత ప్రజలు మరియు ప్రయాణికులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Pulivendula High Tension: పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
JanaSena Candidates List: జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ
జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget