By: ABP Desam | Updated at : 24 Jan 2022 11:07 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
వాలంటీర్లకు అందిన పోస్టులు
కొత్త పీఆర్సీపై ప్రభుత్వం తన వాదనను ప్రజలకు బలంగా వినిపించాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గ్రామ, వార్డు వాలంటీర్లను ఆదేశించింది. కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాల్లో కోత పడదని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో చెప్పారని మంత్రి పేర్ని నాని తెలిపారు. పీఆర్సీపై ప్రజలకు అవగాహన కల్పించాలని వాలంటీర్లకు పోస్టులు చేరినట్లు సమాచారం. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ (ఎఫ్‌వోఏ) సంస్థ వాలంటీర్లకు ఈ పోస్టులు పంపింది. వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాలు ఉన్న గ్రూపులో వీటిని పోస్టు చేయాలని ఎఫ్‌వోఏ తెలిపింది. దీంతో ఆయా గ్రూపుల్లో వాలంటీర్లు పోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటన
పీఆర్సీతో జీతాలు పెరుగుతాయని పోస్టులు
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏంచేసిందో ఆ ప్రకటనలో తెలిపింది. విభజన సమస్యలతోపాటు కోవిడ్ పరిస్థితులతో రాష్ట్రం ఆదాయం తగ్గిందని కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గుతాయని చెప్పడం అవాస్తవమని ఇందులో పేర్కొంది. ఈ పీఆర్సీతో జీతాల పెరుగుతాయని పేర్కొంది. ఇలాంటి 8 పోస్టులను వాట్సప్ గ్రూపుల్లో వాలంటీర్లు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులూ ఆలోచించండి పేరుతో ఈ పోస్టులు వాలంటీర్లకు చేరుతున్నాయి. ఎఫ్‌వోఏ సంస్థకు చెందిన ఎమ్‌ఎల్‌వోలు వీటిని వాలంటీర్లకు పంపుతున్నారు. ఇవే కాకుండా పీఆర్సీపై పార్టీ అభిప్రాయంగా ఉన్న 12 పేజీల నోట్‌ను కూడా సర్క్యులేట్ పంపారు.
నేడు సమ్మె నోటీసు
పీఆర్సీ జీవోలపై ఆగ్రహంతో ఉన్న ఏపీ ఉద్యోగ సంఘాలు... ఆ జీవోలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్ ను కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చిస్తామని పీఆర్సీ సాధన సమితి తేల్చిచెప్పింది. చర్చలకు రావాలని ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ చేసిన చర్చల ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. మంత్రుల కమిటీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని కోరింది. అయితే ఉద్యోగ సంఘాలు జీవోలు రద్దు చేస్తేనే చర్చల గురించి ఆలోచిస్తామని ప్రకటించారు. అశుతోష్ మిశ్ర కమిటీ నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: సమ్మె వద్దు.. చర్చించుకుందాం రండి.. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల ఫోన్
Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య
AP Govt Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈహెచ్ఎస్ కార్డుతో వేరే రాష్ట్రాల్లో ట్రీట్మెంట్
Payyavula Letter : ఏపీలో ఆర్టీఐ చట్ట ఉల్లంఘన - తక్షణం జోక్యం చేసుకోవాలని సీఎస్కు పయ్యావుల లేఖ
Stalin Letter To Jagan : ఏపీ - తమిళనాడు మధ్య జల జగడం ! రెండు ప్రాజెక్టుల్ని నిలిపివేయాలని జగన్కు స్టాలిన్ లేఖ !
Spl Trains to Tirupati : తిరుపతికి టిక్కెట్లు దొరకడం లేదా ? ఇవిగోండి స్పెషల్ ట్రైన్స్ వివరాలు
Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!
64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!