Breaking News Live Telugu Updates: హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసిన TSPSC
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
AP, Telangana Weather Updates: నిన్నటి ద్రోణి నేడు మధ్య చత్తీస్‌గఢ్ నుంచి విధర్భ తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉంది.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల నేడు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం, కొన్ని చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు (మార్చి 29న) తెలంగాణలో వాతావరణం పొడిగా ఉండనుందని వాతావరణ అధికారులు తెలిపారు. మార్చి 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
Weather Warnings: వెదర్ వార్నింగ్స్ ఇవీ
నేడు (మార్చి 28) తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. వచ్చే 5 రోజుల పాటు కూడా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. వాతావరణం పొడిగానే ఉంటుందని అంచనా వేశారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 054 శాతం నమోదైంది.
ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా, యానంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడతాయని అంచనా వేశారు. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే గాలుల తీవ్రత అంతగా ఉండదని చెప్పారు. మళ్లీ మార్చి 31న ఈదురు గాలులు ఉంటాయని అంచనా వేశారు.
ఢిల్లీలో వాతావరణం ఇలా..
దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఆనందాన్ని పొందుతున్నారు. ఆదివారం (మార్చి 26), రాజధాని ఢిల్లీలో మరోసారి ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. బుధవారం (మార్చి 29) నాటికి అది 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఇప్పుడు మొత్తం ఉత్తర భారత రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, తుపానులు తగ్గుతాయి. ఈ మారుతున్న వాతావరణం ప్రభావం ఉత్తరప్రదేశ్‌లోనూ కనిపించనుంది. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం సోమవారం (మార్చి 27) రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా నిర్మలంగా ఉంటుంది. ఈ వారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అయితే ఆదివారం నుండి, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బలమైన ఎండలు కొనసాగాయి. ఉష్ణోగ్రత పెరుగుదల కూడా నమోదైంది.
హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసిన TSPSC
TSPSC Exam Postpone:
హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసిన TSPSC.
ఏప్రిల్ నాలుగవ తేదీన జరగాల్సిన పరీక్షని జూన్ 17కి వాయిదా వేసిన TSPSC.
TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి
నాంపల్లి కోర్టు.... TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి...
నలుగురు నిందితులను నాంపల్లి కోర్టు కు తరలించిన సిట్ అధికారులు..
నలుగురు నిందితులను మూడు రోజుల పాటు విచారించినా సిట్..
ప్రవీణ్, రాజశేఖర్, రాజేశ్వర్, డాక్య లను నాంపల్లి కోర్టు లో హాజరు పరచిన సిట్.
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చింది. ఏడాదిలోపు ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పాస్ కావాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం.
అమరావతిపై సుప్రీంలో విచారణ జులై 11కి వాయిదా
అమరావతే ఏకైక రాజధాని అంటూ అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతోపాటు చాలా పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జులై 11 వ తేదీకి వాయిదా వేసింది.
కడప జిల్లా పులివెందలలో కాల్పుల కలకలం - ఇద్దరి పరిస్థితి విషమం
కడప జిల్లా పులివెందలలో కాల్పులు కలకలం రేపాయి. మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో దిలీప్, మహబూబ్ లపై కాల్పులు జరిపాడు. దిలీప్, భరత్ మధ్య ఆర్థిక లావాదేవీల్లో వివాదం నెలకొనడంతో కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. వారి పరిస్థితి విషమంగా ఉంది.