Breaking News Live Telugu Updates: మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, నెలాఖరుదాకా నిర్వహించాలని నిర్ణయం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు.
తెలంగాణలో క్రమంగా చలి తగ్గి వేడి పెరుగుతోంది. నేడు తెలంగాణలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సాధారణంగా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు, రాత్రి పూట చలి విషయంలో 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
మరో 3 లేదా 4 రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరుతుందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ‘‘ఫసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్ధితుల వలన తేలికపాటి-ఎల్ నినో ఏర్పడే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు లానినా దిశ ఉన్నా, ఇప్పుడు పరిస్ధితులు వెనక్కి మారనున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్ధితుల కంటే ఏప్రిల్ లో మరింత స్పష్టత రానుంది.
ఎల్-నినో అంటే తక్కువ వర్షాలు, లానినా అంటే అధిక వర్షాలు ఉండటం సహజం. దానితో పాటు హిందూ మహాసముద్రం (ఇండియన్ ఓషన్) లో జరిగే మార్పుల వలన కూడ వర్షపాతం మారుతుంది. కానీ దాని ప్రభావం అత్యల్పంగానే ఉంటుంది. కాబట్టి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. లేట్ ఫీ తో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 7 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
Tirumala News: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామి వారి విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, హనుమంతరావు, జబర్దస్త్ నటులు రాకేష్, యాంకర్ రవి, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
AP Assembly: మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 14 నుంచి ఆ నెలాఖరు వరకూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
Ex Minister Narayana: నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు
- శేరిలింగంపల్లిలో మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు
- మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు
- హైదరాబాద్, మాదాపూర్, కొండాపూర్ శరణి నివాసంలో సీఐడీ అధికారుల తనిఖీలు
- మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూముల కొనుగోలు చేసినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు
- దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తింపు
- పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్టుగా సీఐడీ వర్గాలు వెల్లడి
Tadepalli: కన్నతల్లిని వదిలేసిన కుమారుడు
- తాడేపల్లిలో అమానుష ఘటన
- కన్న తల్లిని అర్థరాత్రి డంపింగ్ యార్డ్ లో వదిలివేసిన కన్న కొడుకు
- బాధితురాలు విజయవాడ గవర్నర్ పేటకు చెందిన రామలక్ష్మిగా గుర్తింపు
- ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు పక్క జిల్లాల్లో వదిలివేసిన వైనం
- కన్న కొడుకు ఇక్కడ వదిలి వేయడంతో చనిపోదామని అనుకున్నా దైర్యం చాలలేదు అంటూ కన్నతల్లి రామలక్ష్మి కన్నీటి ఆవేదన
- బాధితురాలు రామలక్ష్మి ఆవేదనపై చలించిన అధికారులు
- బాధితురాలిని ఓ మిషనరీ సంస్థలో చేర్చిన అధికారులు