అన్వేషించండి

Breaking News Live Telugu Updates: ఈ నెల 8న హైదరాబాద్ కు రానున్న ప్రియాంక గాంధీ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: ఈ నెల 8న హైదరాబాద్ కు రానున్న ప్రియాంక గాంధీ

Background

ఈరోజు ద్రోణి / గాలి అనిచ్చితి  తూర్పు విదర్భ  నుండి తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక  మీదుగా  ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు  వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు   తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు  రాగల మూడు రోజులు  రాష్ట్రంలో ఉరుములు,  మెరుపులు,, ఈదురు గాలులు (40 నుండి 50 కిమీ గాలి వేగంతో) కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. 

రాగల 3 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట మీదుగా ఒక మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన ఉపరితల గాలులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో, వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. 

Hyderabad Weather: హైదరాబాద్ లో ఇలా

‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములు, వడగండ్లతో ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 98 శాతం నమోదైంది.

ఏపీలో నేడు వాతావరణం ఇలా

విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర విపత్తుల సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు  కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. ఉరుములు మెరుపుల వర్షంతో కూడి "పిడుగులు" పడే అవకాశం ఉందని తెలిపారు. చెట్ల కింద ఎవరు ఉండవద్దని సూచించారు.

‘‘కడప జిల్లాలో నిన్న రాత్రి మొదలైన వర్షాలు ఇప్పుడు నేరుగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దీని వలన పిడుగులు, వర్షాలు అన్నమయ్య జిల్లాలోని ముఖ్యంగా మదనపల్లి - రాజంపేట ప్రాంతాల్లో మనం మరో రెండు గంటల వ్యవధిలో చూడవచ్చు. అలాగే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడ అక్కడక్కడ వర్షాలను చూడగలం. మరో వైపున మధ్య ఆంధ్రలో భారీ వర్షాలు మరో గంట పాటు కొనసాగనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

22:07 PM (IST)  •  01 May 2023

TSPSC చైర్మన్, సెక్రటరీలను 10 గంటలుగా విచారిస్తున్న ఈడీ

TSPSC కేసులో ఈడీ అప్ డేట్ 

 టీఎస్ పీఎస్సీ కమిషన్ చైర్మన్ జనార్ధన్, సెక్రెటరీ అనిత రామచంద్రన్ లను గడిచిన 10 గంటలుగా విచారిస్తున్న ఈ డి

 చైర్మన్ అండ్ సెక్రెటరీల నుండి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్న ఈడి అధికారులు. 

పేపర్ లీకేజ్, కాస్టోడియల్ సెక్షన్ ఆఫీస్ వివరాలు నమోదు చేసుకుంటున్న ఈడీ..

ఉద్యోగుల పనితీరు, పరీక్షల నిర్వహణ అంశాల పై కూపి లాగుతున్న ఈడీ..

విదేశాలకు చెందిన వారి లిస్ట్ పైఆరా తీస్తున్న ఈడీ.

తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ సంస్థ కు చెందిన పలువురు అధికారులను సైతం విచారిస్తున్న ఈడీ.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మనీలాండరింగ్  కోణంలో ఈడి విచారణ 

31 లక్షల తో పాటు విదేశాల నుండి డబ్బు వచ్చిందన్న ఆరోపణల పైన ఈడి దర్యాప్తు

22:02 PM (IST)  •  01 May 2023

ఈ నెల 8న హైదరాబాద్ కు రానున్న ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు 

 ఈ నెల 8 న హైదరాబాద్ రాక 

 సరూర్ నగర్ స్టేడియం లో జరిగే నిరుద్యోగ బహిరంగ సభలో ప్రియాంక ప్రసంగం

20:41 PM (IST)  •  01 May 2023

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు DA మంజూరు చేస్తూ ఉత్తర్వులు

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు DA ఉత్తర్వులు విడుదల
ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన DA ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు 
 ఉద్యోగులకు DA,  67 ద్వారా పెన్షనర్లకు DR 2.73% మంజూరు 
. ఈ కొత్త DA ను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ఇచ్చేవిధంగా  ఏర్పాటు
 జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన DA బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్ మరియు మార్చి నెలల్లో 3  సమాన వాయిదాలలో  చెల్లింపు
  ఈ కొత్త DA తో కలిపి ఉద్యోగుల మొత్తం DA 22.75 శాతం పెరుగుదల.
.   DA మంజూరు చేసిన గౌరవ  ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి కి  ధన్యవాదాలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్
కాకర్ల వెంకటరామిరెడ్డి

18:55 PM (IST)  •  01 May 2023

ఏపీ సీఎం జగన్ ను కలిసిన భారత్‌లో యూఏఈ రాయబారి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి
ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు
- ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం, రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం
- సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న సీఎం
- ఫుడ్‌ పార్క్‌లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్‌ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి వివరించిన యూఏఈ రాయబారి, ఏపీని పెట్టుబడులకు లీడ్‌ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడి.
- ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై మున్ముందు ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ
- ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, యూఏఈ రాయబార కార్యాలయ అధికారులు.

15:38 PM (IST)  •  01 May 2023

తుని రైలుకు నిప్పు కేసును కొట్టేసిన కోర్టు

తుని రైలుకు నిప్పు కేసును కొట్టివేసిన రైల్వే కోర్టు
ముద్రగడ పద్మనాభంతో పాటు కేసులో ఉన్న 41 మందికి ఊరట లభించింది.
కేసు సరిగ్గా విచారణ చేయలేదని ముగ్గురు రైల్వే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget