Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
పసుపు పండగ నేటి నుంచే ప్రారంభం. 2024 ఎన్నికలకు నేతలను, కార్యకర్తలను సిద్ధం చేసేందుకు తెలుగు దేశం రెడీ అయింది. ఒంగోలు వేదికగా రెండు రోజు పాటు నిర్వహించే మహానాడుకు సర్వం సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశ రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీ పెను సంచలనం. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి 40 ఏళ్లల్లో ఎన్నో ఘన విజయాలు సాధించింది. అంతకు మించిన సంక్షోభాలను కూడా ఎదుర్కొంది.
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా అలాంటి పరీక్షలనే ఎదుర్కొంటోంది. అందుకే మరోసారి వారిలో ఉత్తేజం నింపి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ. అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఓవైపు కేసులు మరోవైపు నేతల మధ్య ఉన్న విభేదాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.
కీలకమైన నేతలు చాలా మంది ఇప్పటికి కూడా సైలెంట్‌గా ఉండిపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల బెడద ఎక్కువైందని... అందుకే చాలా మంది నాయకులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదని టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో నేతల్లో, శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి పోరాటాలు చేస్తే పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వాలని చూస్తోంది టీడీపీ.
మొన్నటికి మొన్న చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లింది. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన లభించిందని.. పార్టీ విశ్లేషిస్తోంది. ఇన్నాళ్ల నుంచి పార్టీపై ఉన్న అపోహ తొలగిపోయిందని అంటున్నారు నేతలు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేపట్టేందుకు కార్యాచరణ తీసుకునే ఆవకాశం కూడా ఉంది.
కరోనా టైంలో అన్‌లైన్‌లో మహానాడు నిర్వహించిన తెలుగుదేశం... 2018 తర్వాత తొలిసారిగా అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఒంగోలులో జరిగే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నేతలు తరలి వచ్చారు.
8.30 గంటలకు ప్రతినిధులు నమోదుతో మహానాడు ప్రారంభమవుతుంది. తర్వాత ఉదయం 10 గంటలకు ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరం ప్రారంభిస్తారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి... మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాప తీర్మానం ప్రవేశ పెడతారు. 11.45కు చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. తర్వాత తీర్మానాలపై చర్చ జరుగుతుంది. మొత్తం 17 తీర్మానాలు ప్రవేశ పెడతారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ తీర్మనాలే ఎక్కువగా ఉంటాయి.
నేటి నుంచి రెండు రోజుల పాటు (మే 27, 28) ఒంగోలు సమీపాన మండువారిపాలెంలో జరిగే మహానాడు కార్యక్రమం దృష్ట్యా వాహనాల రాకపోకలకు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా జిల్లా ఎస్పీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాబట్టి, ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను అనుసరించి ఇబ్బంది లేకుండా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.
మహానాడు కార్యక్రమానికి వచ్చే వాహనాల కోసం మార్గాలు
1. గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుండి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లై ఓవర్ ఎక్కకుండా బై లైన్/సర్వీస్ రోడ్ లో ఎంటర్ ఆయ్యి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణు ప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళాలి.
2. నెల్లూరు, కావలి వైపు నుండి మహానాడుకు వచ్చే వాహనాలు ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించకుండా పెళ్లూరు ఫ్లైఓవర్ ఎక్కి కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ బైపాస్ పాస్ మీదగా విష్ణు ప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళవలెను.
3. కడప, కర్నూలు, చీమకుర్తి వైపునుండి మహానాడుకు వచ్చే వాహనాలు కర్నూల్ బై పాస్ సెంటర్ మీదగా సర్వీస్ రోడ్డు ద్వారా విష్ణు ప్రియ కల్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళాలి.
4. కొత్తపట్నం వైపు నుండి వచ్చే వాహనాలు కొప్పోలు ఫ్లైఓవర్ మీదగా కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ పాస్ మీదగా విష్ణు ప్రియ కల్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళాలి.
5. విజయవాడ, గుంటూరు, చీరాల వైపునుండి ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించే వాహనదారులు కిమ్స్ ఫ్లైఓవర్ మీదగా కొప్పోలు ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు మీదగా కొత్తపట్నం బస్టాండ్ మీదుగా ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించాలి.
KA Paul : బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో శాంతియుతంగా ఉన్న అన్ని మతస్థులను, తన వ్యాఖ్యలతో బండి సంజయ్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో శాంతి లేకుండా చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం వెంటనే బండి సంజయ్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీని ఎన్టీఆర్ కుటుంబంలో ఒకరైన బాలకృష్ణకు గానీ జూనియర్ ఎన్టీఆర్ కు గానీ అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్యకు సీఎం జగన్ రాజ్యసభ సీటు ఇచ్చినంత మాత్రాన బీసీలందరూ ఓటేస్తారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు.
హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పథకం సాధించిన నిఖత్ జరీన్ మొదటిసారి హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆమెకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. నిఖత్ జరీన్ కు స్వాగతం పలికేందుకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. బాక్సర్ నిఖర్ జరీన్ కు మంత్రులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
Mahanadu: పసుపు వర్ణమైన ఒంగోలు
ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మహానాడు ప్రాంగణమే కాదు, ఒంగోలు మొత్తం పసుపు కాంతులీనుతోంది.(1/2)#Mahanadu2022 pic.twitter.com/PI96bKqmN9
— Telugu Desam Party (@JaiTDP) May 27, 2022
Adilabad Woman Murder: నడిరోడ్డుపైనే యువతిని నరికి చంపిన దుండగులు
ఆదిలాబాద్ జిల్లాలో అతి కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపైనే ఓ యువతిని దుండగులు నరికి చంపారు. నార్నూర్ మండలం నాగోల్ కొండలో ఈ ఘటన జరిగింది. దీంతో రాజేశ్వరి అనే యువతి అక్కడికక్కడే చనిపోయింది. దీన్ని పరువు హత్యగా భావిస్తున్నారు. నెల రోజుల క్రితం యువతి మతాంతర వివాహం చేసుకుంది. అది కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా హత్య సంచలనం రేపుతోంది.
TDP Mahanadu 2022 Updates: ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయింది - చంద్రబాబు
‘‘ఎక్కడికక్కడ మహిళలపై దాడులు కూడా పెరిగిపోయాయి. ఇంట్లో ఉంటే కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. టీడీపీ హాయంలో ఇలాంటి ఘటన జరిగితే 20 టీమ్ లు ఏర్పాటు చేస్తే నిందితుడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అది టీడీపీ విధానం. ఎక్కడ చూసినా గంజాయి, మద్యం, డ్రగ్స్ అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. సంఘ విద్రోహశక్తులను పెంచి పోషిస్తున్నారు.’’ అని చంద్రబాబు విమర్శించారు.