అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP NGOs: ఏపీ సర్కార్ హామీ - ఈ 27న రోడ్డు ఉద్యమం తాత్కాలిక వాయిదా

Bandi Srinivasa Rao News: ఈనెల 27న రాష్ట్ర జేఏసీ తలపెట్టిన “బి ఆర్ టి ఎస్ మహా ఆందోళన” కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రాష్ట్ర జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. 

AP NGO News: విజయవాడ : గత రెండు వారాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దశలవారీగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వ పెద్దలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అసలే ఎన్నికల సమయం కావడంతో వైసీపీ సర్కార్ (YSRCP Government ) ఆచితూచి వ్యవహరిస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులను మంత్రుల బృందం (AP Ministers Team) ఆహ్వానించిన చర్చలలో తమకు రావలసిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చింది. దాంతో ఈనెల 27న రాష్ట్ర జేఏసీ తలపెట్టిన “బి ఆర్ టి ఎస్ మహా ఆందోళన” కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రాష్ట్ర జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు (Bandi Srinivasa Rao) తెలిపారు. 

ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ పొందటం “పాక్షిక విజయం” 
ఆదివారం ఎన్జీవో హోమ్ (NGO Home) లో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు మధ్యంతర భృతి కోసం ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్ మేరకు ప్రభుత్వం స్పందిస్తూ ఉద్యోగులకు సత్వరమే 12వ పీఆర్సి ప్రయోజనాలు (12th PRC Benefits) కల్పించేలా పి ఆర్ సి కమిషన్ వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మధ్యంతర భృతి ఇచ్చేందుకు నిరాకరించిందన్నారు. ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తం ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో 70 కోట్ల రూపాయలు, సిపిఎస్ ఉద్యోగులకు టీఏ, డి ఏ ల నిమిత్తం చెల్లించాల్సిన మొత్తంలో 100 కోట్ల రూపాయలు వీలైనంత సత్వరంగా నిధులు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం చెప్పిందన్నారు. 

మార్చి నెలాఖరు నాటికి కొన్ని ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు 
పెన్షనర్ల డిమాండ్లలో ప్రధానమైన క్వాంటం ఆఫ్ పెన్షన్ లో మార్పులు చేసేందుకు చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ఉన్న అవాంతరాలను అధిగమించి వారికి న్యాయం చేసేందుకు కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని తమకు ఇచ్చిన ఒప్పంద పత్రంలో పేర్కొన్నట్లు వివరించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% జీతం పెంపు కూడా తమ ఒప్పందంలో ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లలో కొన్నింటిని సాధించుకున్నామన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డిమాండ్లను మార్చి నెలాఖరు నాటికి  పూర్తిగా నెరవేరుస్తుందనే ఆశాభావంతో తమ ఆందోళన తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. 

ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర జేఏసీ 
27వ తేదీన తలపెట్టిన మహా ఆందోళన కార్యక్రమానికి హాజరుకాకుండా ఉండేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉద్యోగ సంఘ నేతలను పోలీసులు అక్రమ కేసులు పెడతామని బెదిరించడాన్ని, కొంతమంది ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడాన్ని రాష్ట్ర జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పోలీసులు కూడా తమకు మిత్రులేనని పేర్కొన్నారు. అయినప్పటికీ తమ ఉద్యోగులను బెదిరించడానికి నిరసనగా 27వ తేదీన రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో సంఘ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతారని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర జేఏసీ కార్యదర్శి కె.వి శివారెడ్డి, జేఏసీలోని వివిధ సంఘాలకు చెందిన పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Also Read: టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget