అన్వేషించండి

'జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు'.. అంటూ పవన్ కు మంత్రి పేర్ని నాని కౌంటర్ 

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుంది. పవన్ ట్వీట్ కు బదులుగా పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.


రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. అయితే దీనికి కౌంటర్ గా మరుసరి రోజు ఏపీ మంత్రులు మాట్లాడారు. మంత్రి పేర్ని నాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పుడు మెుదలైన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ట్విట్టర్ వేదికగా నడుస్తూనే ఉంది. 'తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే' అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా పేర్కొన్నారు. 

పవన్ కల్యాణ్ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. 'జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు' అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు.

గాంధీగిరి తరహా నిరసన
అయితే ఓ వేపు మాటల యుద్ధం జరుగుతుంటే.. పవన్ మరోవైపు గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ నుంచి  ప్రభుత్వంపై గాంధీగిరి తరహా నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రోడ్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అడుగుకో గుంత, గజానికో గొయ్యి అంటూ ప్రత్యేక డిజిటల్ ఉద్యమాన్ని జనసేన నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.

పలుగు, పార చేతబట్టి శ్రమదానం చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం దగ్గర దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లా కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి-ధర్మవరం రోడ్డును బాగుచేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు ఈ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటాయి.

Also Read: Pavan Vs Ysrcp : గాంధీ జయంతి రోజున పవన్ కల్యాణ్ గాంధీగిరి ! ప్రభుత్వం అనుమతి ఇస్తుందా ? అడ్డుకుంటుందా ?

Also Read: Pawan Kalyan: వైసీపీ నేతలకు పవన్ రివర్స్ కౌంటర్... ట్విట్టర్ వేదికగా వరుస పంచ్ లు...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Embed widget