అన్వేషించండి

Big Alert to AP Politicians: ఏపీ రాజకీయ నాయకులకు బిగ్ అలర్ట్, ఏ క్షణమైనా దాడి జరగొచ్చంటూ హెచ్చరికలు!

Big Alert to AP Politicians: ఏపీ రాజకీయ నాయకులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాయకులపై దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిపారు. 

Big Alert to AP Politicians: ఆంధ్రప్రదేశ్ రాజకీయం మాంచి రంజుగా సాగుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు - ప్రతి విమర్శలతో వాడి వేడిగా నడుస్తోంది. మూడు విమర్శలు, ఆరు తిట్లతో ఏపీ రాజకీయం సాగుతోంది. రాజకీయ రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల నిరంతరం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కొన్ని రోజుల క్రితం విశాఖ పట్నం ఎయిర్ పోర్టు వద్ద ఆంధ్రప్రదేశ్ మంత్రులపై జనసేని పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు,పవన్ కల్యాణ్ అభిమానులు దాడి చేసిన సంగతి తెలిసిందే. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. మంత్రుల కాన్వాయ్ లోని కార్లను ధ్వంసం చేశారు. కార్ల అద్దాలు పగుల గొట్టారు. వేలాది మంది జనసేన మద్దతు దారులు అలా విరుచుకు పడటంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. 

దాడులు - ప్రతిదాడులు

మంత్రులపై హత్యాయత్నం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 9 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో వారికి బెయిల్ వచ్చినప్పటికీ.. ఆ వివాదం మాత్రం రోజు రోజుకూ ముదురుతూనే వస్తోంది. ఈ ఘటన అనంతరం పవన్ కల్యాణ్ ఓ సభ చేసిన వ్యాఖ్యలపై వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. చెప్పుతో కొడతానంటూ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ వర్గీయులు.. శ్రీకాకుళం జిల్లాలోని జనసేన కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ఎదురు దాడికి దిగారు. దీంతో శ్రీకాకుళంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

ఇప్పట్లో ఆగేలా కనిపించని దాడులపర్వం

పోలీసులు రంగ ప్రవేశం చేసి అప్పటికి సద్దుమణిగేలా చేసినప్పటికీ.. ఈ దాడులు ఇప్పట్లో మాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఒక పార్టీకి చెందిన వారిపై మరొక పార్టీకి చెందిన వ్యక్తులు దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. మంత్రులు, వైఎస్సార్ సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై, వారి ఇళ్లపై దాడులు జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలపై మాత్రమే కాకుండా, పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులపై కూడా దాడులు జరగవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కేవలం జనసేన, వైఎస్సార్ సీపీ పార్టీల మధ్యే కాకుండా, ఇతర పార్టీల మధ్య కూడా రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. వైసీపీ -  తెలుగు దేశం పార్టీ, వైసీపీ -  జనసేన అనేలా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా.. రాజకీయం మాత్రం ఎన్నికల వేళ ఉన్నంత హాట్ హాట్ గా ఉన్నాయి. అన్ని పార్టీల నాయకులు తిట్ల దండకాలు లంకించుకుంటూ రాజకీయాలు అంటేనే ఏవగింపు అనుకునేలా తయారు చేస్తున్నారని సామాన్య ప్రజల నుండి రాజకీయ నిపుణుల వరకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
Grey Hair : జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
CM Revanth Reddy: కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Embed widget