అన్వేషించండి

AP High Court On Chintamani Play : చింతామణి నాటకం నిషేధంపై స్టేకు ఏపీ హైకోర్టు నిరాకరణ

AP High Court On Chintamani Play : చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు అంగీకరించలేదు. ఈ నాటకాన్ని నిషేధించడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు.

AP High Court On Chintamani Play : చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించింది. ఈ నిర్ణయంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రఘురామకృష్ణరాజు తరపున ప్రముఖ న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపించారు. చింతామణి నాటకాన్ని నిషేధించడం వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమే అని న్యాయవాది ఉమేష్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ నాటకాన్ని నిషేధించిన కారణంగా పలువురు జీవన ఉపాధి కోల్పోయారని కోర్టుకు తెలిపారు. దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా ఈ నాటకం వచ్చిందన్నారు. ఇప్పుడు ఈ నాటకాన్ని నిషేధించాల్సిన అవసరంలేదని కోర్టుకు తెలిపారు. నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా న్యాయవాది ఉమేష్ హైకోర్టును అభ్యర్థించారు. అయితే న్యాయవాది ఉమేష్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి ధర్మాసనం అంగీకరించలేదు. ఈ నాటకానికి సంబంధించిన అసలు పుస్తకం అనువాద కాపీ సమర్పించాల్సిందిగా పిటిషనర్ ను ఆదేశించింది. విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. 

చింతామణి నాటకంపై నిషేధం 

చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర వైశ్యులను అవమానించేదిగా ఉందని తక్షణం ఆ నాటకాన్ని నిషేధించాలని కొంత కాలంగా ఆర్యవైశ్య సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేస్తూ వస్తున్నారు. చింతామణి నాటకం ఇప్పటిది కాదు. 1920 ప్రాంతంలో కాళ్ళకూరి నారాయణరావు రాశారు. ఆనాటి సాంఘిక దురాచారాలను, తప్పుడు సంప్రదాయాలను సంస్కరించేందుకు ఈ నాటకాన్ని అప్పటి పరిస్థితులను బట్టి రాశారు. నాటకాలే ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న రోజుల్లో ఈ చింతామణి నాటకానికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో తన వంతు పాత్ర పోషించింది. అలాంటి నాటకం చరిత్రలో నిలిపోయింది. వందేళ్ల తర్వాత ఇప్పుడు ఆ నాటకాన్ని నిషేధించడం అతిశయోక్తిగా ఉందని పలువు భావిస్తున్నారు. 

వందేళ్ల చరిత్ర గల నాటకం

చింతామణి నాటక ప్రదర్శనను ఏపీ ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధంపై కళాకారుల నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ వివాదం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7ను సవాల్ చేస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోర్టును  కోరారు. అప్పటి సమాజంలో వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రాశారని తెలిపారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న నాటకంపై నిషేధం విధించడం సరికాదన్నారు. ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వేల మంది కళాకారులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తే కళాకారులు రోడ్డున పడతారన్నారు. నాటకంలోని ఒక పాత్ర కారణంగా మొత్తం నాటక ప్రదర్శనపై నిషేధం విధించడం సరికాదన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జీవో 7ను రద్దు చేయాలని ఎంపీ రఘురామ కోర్టుకు వెళ్లారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget