X

MPTC ZPTC News: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్‌పై తొలగిపోని సస్పెన్ష్‌...తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం చేసిన అప్పీలుపై విచారణ జరిగింది. అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. 

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కౌంటింగ్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. పరిషత్‌ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును రిజర్వ్‌ చేసింది.

 ఏపీలో పరిషత్‌ ఎన్నికల వ్యవహారంలో రీనోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై అప్పట్లో డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టొద్దని ఆదేశాలు జారీచేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘంట అప్పీలు చేసింది. ఈ విషయంపై గతంలో విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌ రీ నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ సింగిల్‌ జడ్జి గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉందని ధర్మాసనం భావించింది. 

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం ఇంకా తేలలేదు. ఎన్నికలు జరిగినా ఫలితాలపై హైకోర్టు తుది నిర్ణయం పెండింగ్ లో ఉండటంతో స్థానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు వీల్లేకుండా పోయింది. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ తర్వాత ఫలితాల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనతో మండల, జిల్లా పరిషత్ లలో పాలనపై తీవ్ర ప్రభావమే పడుతోందని చెప్పాలి.  

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. తొలుత కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కరోనా తగ్గిన తర్వాత ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన చిక్కులు సైతం ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఏకగ్రీవాలపై విపక్షాలు న్యాయపోరాటనికి దిగడంతో ఎన్నికల నిర్వహణ చేపట్టలేనంటూ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  చేతులెత్తేశారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ వచ్చి రాగానే ఎన్నికలకు నోటిపికేషన్ ఇచ్చారు. వారం రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం కూడా చకచకా జరిగిపోయింది. ఈ వ్యవహారంపై అంతా హైకోర్టుకు వెళ్లింది. ఆమె సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. 

Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!

                Chittoor: చిత్తూరు జిల్లాలో వింత...గుడ్లు పెట్టిన కోడిపుంజు...నెట్టింట హల్ చల్

Tags: AP Latest news AP High court news AP MPTC ZPTC Elections Mptc zptc election results AP High court verdict

సంబంధిత కథనాలు

Poor States :  పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

Breaking News: నారాయణపూర్‌లో నక్సలైట్లు మళ్లీ బీభత్సం.. పోస్టర్ల కలకలం

Breaking News: నారాయణపూర్‌లో నక్సలైట్లు మళ్లీ బీభత్సం.. పోస్టర్ల కలకలం

Crop Damage: నెల్లూరు పంట నష్టం అంచనా 8.5కోట్ల రూపాయలు..

Crop Damage: నెల్లూరు పంట నష్టం అంచనా 8.5కోట్ల రూపాయలు..

Crime News: ఫ్రెండ్‌ లవర్‌పై కన్నేశాడు.. శవమై కనిపించాడు... సినిమా థ్రిల్లర్‌కు మించిన క్రైమ్‌ లవ్‌స్టోరీ..!

Crime News: ఫ్రెండ్‌ లవర్‌పై కన్నేశాడు.. శవమై కనిపించాడు... సినిమా థ్రిల్లర్‌కు మించిన క్రైమ్‌ లవ్‌స్టోరీ..!

Student Death: హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 

Student Death: హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samantha: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!

Samantha: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Monal Gajjar Photos: అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Monal Gajjar Photos:  అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా.. 

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా..