అన్వేషించండి

AP Heavy Rains: తీరం దాటిన వాయుగుండం - విశాఖలో 236 మిమీ కుండపోత.. 80 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు!

AP weather update : ఆంధ్రప్రదేశ్‌ను వాయుగుండం కుదిపేస్తోంది. విశాఖపట్నంలో రికార్డు స్థాయిలో 236 మిమీ వర్షపాతం నమోదు అయింది. విపత్తు నిర్వహణ సంస్థ హైఅలెర్ట్ ప్రకటించింది.

Cyclone Warning:  బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర వర్షపాతంతో వణికిపోతోంది. గడిచిన 24 గంటల్లో  బుధవారం ఉదయం 8:30 నుండి గురువారం ఉదయం 7:00 వరకు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో జలప్రళయాన్ని తలపించేలా వర్షపాతం నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం రికార్డవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

విశాఖలో కుండపోత 

ఈ వర్షాల దాటికి విశాఖపట్నం నగరం తీవ్రంగా ప్రభావితమైంది. విశాఖ రూరల్ పరిధిలోని తులసీనగర్‌లో గరిష్టంగా 236 మిమీ వర్షపాతం నమోదు కాగా, మధురవాడలో 218 మిమీ, ఎండాడలో 210 మిమీ, సీతమ్మధారలో 205 మిమీ, కాపులుప్పాడలో 202 మిమీ, మహరాణిపేటలో 199 మిమీ చొప్పున రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. విశాఖతో పాటు పరిసర ప్రాంతాలైన పెందుర్తి  179 మిమీ , బుచ్చిరాజుపాలెం 171 మిమీ , విజయనగరం జిల్లా కొత్తవలస (188 మిమీ) ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా విశాఖలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం పూర్తిగా స్థంభించింది.  

 

కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, కృష్ణా ,  ఎన్టీఆర్ జిల్లాల్లోనూ ధారాపాతంగా వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేటలో 158 మిమీ, కాకినాడ రూరల్‌లో 148 మిమీ, తూర్పుగోదావరి గాడాలలో 146 మిమీ, ఎన్టీఆర్ జిల్లా చంద్రాలో 133 మిమీ, కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 132 మిమీ వర్షపాతం నమోదైంది. ఏలూరు, పోలవరం  దేవిపట్నం ప్రాంతాల్లో సైతం భారీ వర్షాలు రికార్డయ్యాయి. వాయుగుండం తీరం దాటే క్రమంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.  

రో 24 గంటల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత 

వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. రాబోయే మరో 24 గంటల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. సముద్రం తీవ్ర అలజడిగా ఉన్నందున మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఆకస్మిక వరదలు  వచ్చే ముప్పు ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల నివాసితులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు స్పష్టం చేశారు.

ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు 

పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు మరియు క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని హైఅలెర్ట్‌లో ఉంచింది. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ , ఎస్డీఆర్‌ఎఫ్  బృందాలను సిద్ధం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, విద్యుత్ తీగలు, పొంగిపొర్లుతున్న వాగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం మైకుల ద్వారా ప్రచారం చేస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు వేగవంతం చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh On Raptadu Girl Health: రాప్తాడు బాలిక ఒక ఫైటర్.. మళ్లీ నవ్వుతోంది, నడుస్తోంది.. పూర్తి బాధ్యత తనదంటూ మంత్రి లోకేశ్ భరోసా
రాప్తాడు బాలిక ఒక ఫైటర్.. మళ్లీ నవ్వుతోంది, నడుస్తోంది.. పూర్తి బాధ్యత తనదంటూ మంత్రి లోకేశ్ భరోసా
ABP Southern Rising Summit 2026:హైదరాబాద్‌లో రేపే సదరన్ రైజింగ్ సమ్మిట్ .. షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌తో దక్షిణాది ప్రగతిపై మేధోమథనం.. హాజరయ్యే ప్రముఖులు వీరే!
హైదరాబాద్‌లో రేపే సదరన్ రైజింగ్ సమ్మిట్ .. షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌తో దక్షిణాది ప్రగతిపై మేధోమథనం.. హాజరయ్యే ప్రముఖులు వీరే!
Janasena Rukmini Kota: జాబ్ ఫ్రాడ్‌పై ఫిర్యాదు చేసిందే నేను.. పవన్ కల్యాణ్ పేరు ఎందుకు లాగుతున్నారు?- కోట రుక్మిణి లేఖ!
జాబ్ ఫ్రాడ్‌పై ఫిర్యాదు చేసిందే నేను.. పవన్ కల్యాణ్ పేరు ఎందుకు లాగుతున్నారు?- కోట రుక్మిణి లేఖ!
YS Sharmila Invitation Controversy: పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!
పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Samantha : బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
Embed widget