అన్వేషించండి

AP Roads : రోడ్లపై గుంతలా? ఫిర్యాదులకు యాప్ సిద్ధం చేస్తున్న ఏపీ సర్కార్

రోడ్ల మీద గుంతలుంటే యాప్ లో ఫిర్యాదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది.

రోడ్లపై గుంతలు పడితే నేరుగా యాప్ లోనే ఫిర్యాదు చేసే విధానాన్ని ఏపీ సర్కార్ తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన యాప్ రూపకల్పనను నెలరోజుల్లో సిద్దం చేయాలని సీఎం జగన్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. అంతే కాదు యాప్ రూపకల్పన చేసి రియల్ టైం మానిటరిగ్ చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. 

రోడ్ల పరిస్థితిపై సీఎం జగన్ ఆరా 

ఏపీలో రోడ్ల పరిస్థితిపై ప్రజానీకంలో అసహనం వ్యక్తం అవుతుంది. నిధుల సమస్యతో ప్రభుత్వం దెబ్బ తిన్న రోడ్లను తాత్కాలికంగా పూడ్చి  కొంత మేర ప్రజలకు అనువుగా తీర్చిదిద్దుతోంది. పూర్తిగా పాడైన రోడ్లను కొత్తగా నిర్మిస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం జగన్ రోడ్ల పరిస్థితులపై అధికారులకు పలు సూచనలు చేశారు. నగరాలు, పట్టణాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పరిస్థితి ,ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియచేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చేందుకు వీలుటుందని జగన్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలంలో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందు కోసం ప్రత్యేక యాప్‌ రూపొందించే బాధ్యతను పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించారు సీఎం జగన్.

‘‘ఏపీ సీఎం ఎంఎస్‌’’ (ఏపీ కన్‌సిస్టెంట్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ మున్సిపల్‌ సర్వీసెస్‌) యాప్‌తో రియల్‌టైం మానిటరింగ్‌ చేసేందుకు వీలుగా రూపకల్పన ఉండాలన్నారు సీఎం జగన్. మరో నెల రోజుల్లో యాప్ ను సిద్ధం చేయాలన్నారు. రోడ్లపై గుంతలు, రోడ్లకు మరమ్మతులు మాత్రమే కాదు. పచ్చదనం, సుందరీకరణ, వీధిలైట్లు, నిర్వహణ, పుట్‌పాత్స్, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, భూగర్భ మురుగునీటి వ్యవస్థల నిర్వహణ, పబ్లిక్‌ టాయ్‌లెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ట్రాఫిక్‌ జంక్షన్లు, వాటి నిర్వహణ అంశాల పై యాప్‌ ద్వారా  రియల్‌ టైం మానిటరింగ్ చేసేందుకు అవసరం అయిన అన్ని చర్యలు ఉండాలన్నారు. రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో ఈ మౌలికసదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరగాలన్న సీఎం, వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటలవరకూ తనిఖీలు చేయాలన్నారు. తమ పరిధిలోని సుమారు 6–7 కి.మీ. మేర రోడ్ల పై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఫొటో తీసి యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలని గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పౌరులకూ ఫోటోలు అప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించాలని సూచించారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను యాప్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు ఈ సమస్యలు సంబంధిత విభాగాలకు.. అక్కడ నుంచి పరిష్కారాలు నివేదించిన ప్రతి సమస్య పరిష్కారంపై మానిటరింగ్‌ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సాంకేతికతను ఉపయోగించి సమస్యల పరిష్కారం

మున్సిపల్‌ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాల్లో తీసుకువస్తున్న యాప్‌ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. నగరాల్లో, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా ఇతర మౌలిక సదుపాయాలు నిర్వహణ పూర్తిగా మెరుగుపడాలన్నారు. యాప్‌ ద్వారా వచ్చే గ్రీవెన్స్‌ను పరిష్కరించే వ్యవస్థ బలోపేతంగా ఉండాలన్న సీఎం, వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ అంశం పై కూడా దృష్టిపెట్టాలని అదికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీర్ఘకాలం మన్నే పద్ధతిలో రోడ్ల నిర్మాణం ఉండాలన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Chandraababu On Mega DSC: దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మెగా డీఎస్సీపై చర్చించండి: వైసీపీకి సీఎం చంద్రబాబు ఛాలెంజ్
దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మెగా డీఎస్సీపై చర్చించండి: వైసీపీకి సీఎం చంద్రబాబు ఛాలెంజ్
Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ.. పీఠికాపుర వనం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ.. పీఠికాపుర వనం ప్రారంభించిన పవన్ కళ్యాణ్
Chandrababu In Kuppam: కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
High Tension At Vijayawada SAAP Office: శాప్ ఆఫీసు ముట్టడికి వైసీపీ యత్నించడంతో ఉద్రిక్తత.. నిజాలు తెలుసుకోవాలంటూ ఉద్యోగులు మండిపాటు
శాప్ ఆఫీసు ముట్టడికి వైసీపీ యత్నించడంతో ఉద్రిక్తత.. నిజాలు తెలుసుకోవాలంటూ ఉద్యోగులు మండిపాటు

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu In Kuppam: కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Farmhouses Files: ఫాం హౌస్‌లలో కూర్చుని వందల ఎకరాలు, వేల కోట్లు దోచుకున్నారు: కేసీఆర్ పై రమ్యా రావు ఆరోపణలు
ఫాం హౌస్‌లలో కూర్చుని వందల ఎకరాలు, వేల కోట్లు దోచుకున్నారు: కేసీఆర్ పై రమ్యా రావు ఆరోపణలు
CM Joseph Vijay gold ring scheme: బంగారంతో ఓటర్లను పడగొడుతున్న విజయ్ - పుట్టే ప్రతి బిడ్డకూగ్రాము బంగారం - ఇక తిరుగుండదా?
బంగారంతో ఓటర్లను పడగొడుతున్న విజయ్ - పుట్టే ప్రతి బిడ్డకూగ్రాము బంగారం - ఇక తిరుగుండదా?
Vijayasai Reddy targets Jagan: ఒరిజినల్ రెడ్ల కార్డ్‌తో విజయసాయిరెడ్డి.. జగన్ సొంత సామాజిక పునాదికే పగుళ్లు పుట్టించే వ్యూహమేనా?
ఒరిజినల్ రెడ్ల కార్డ్‌తో విజయసాయిరెడ్డి.. జగన్ సొంత సామాజిక పునాదికే పగుళ్లు పుట్టించే వ్యూహమేనా?
Auto Driver Murder: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణహత్య.. ప్రాణాలు తీసిన చిల్లర వివాదం
Auto Driver Murder: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణహత్య.. ప్రాణాలు తీసిన చిల్లర వివాదం
Rains In AP and Telangana: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ
Open AI Hacking: ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!
ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!
Nani Reaction : తల్లీ కొడుకుల సెంటిమెంట్ విత్ యాక్షన్ - ది ప్యారడైజ్ స్టోరీ ఏంటో చెప్పేసిన నాని... ఇక థియేటర్స్‌కు వెళ్లడమే...
తల్లీ కొడుకుల సెంటిమెంట్ విత్ యాక్షన్ - ది ప్యారడైజ్ స్టోరీ ఏంటో చెప్పేసిన నాని... ఇక థియేటర్స్‌కు వెళ్లడమే...
Embed widget