అన్వేషించండి

AP Cabinet social media influencer policy: సోషల్ మీడియాలో 10K ఫాలోవర్లు ఉన్నారా? ఏపీ ప్రభుత్వం నుంచి నెలకు రూ.15,000 వరకు సంపాదించే ఛాన్స్!

Digital Creator Monetization: ఏపీ ప్రభుత్వం కొత్త సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా రూ.2,500 నుండి రూ.15,000 వరకు సంపాదించే అవకాశం కల్పిస్తోంది.

AP IPR social media guidelines 10k followers earnings:  సోషల్ మీడియా క్రియేటర్లకు , ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ యుగానికి తగినట్లుగా ఒక సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాలనాపరమైన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు,  ప్రజలకు ఉపయోగపడే అత్యవసర సమాచారాన్ని క్షేత్రస్థాయిలోకి వేగంగా చేరవేసే లక్ష్యంతో  సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ కి ఏపీ కేబినెట్ అధికారిక ఆమోదం తెలిపింది. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా యువతకు, సామాన్యులకు వేగంగా రీచ్ లభిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త విధానం ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య ప్రాతిపదికన క్రియేటర్లను ప్రధానంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. 10 వేల నుంచి 24,999 వరకు ఫాలోవర్లు ఉన్నవారిని ప్రారంభ కేటగిరీగా గుర్తించి రూ.2,500 వరకు, 25 వేల నుంచి 49,999 ఫాలోవర్లు ఉన్నవారికి రూ.5,000 వరకు చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా 50 వేల నుంచి 99,999 ఫాలోవర్లు ఉన్న మీడియం క్రియేటర్లకు రూ.7,500 వరకు, లక్ష అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న టాప్ క్రియేటర్లకు గరిష్ఠంగా రూ.15,000 వరకు ప్రతిఫలం అందించనున్నారు.

అయితే, కేవలం భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన అందరికీ ఈ అవకాశం దక్కదు. పారదర్శకతను కాపాడటానికి , నకిలీ   ఖాతాలను అరికట్టడానికి ప్రభుత్వం కొన్ని కఠినమైన ప్రమాణాలను నిర్దేశిస్తోంది. అకౌంట్   ఆర్గానిక్ రీచ్, పోస్ట్ చేసే కంటెంట్ నాణ్యత, ఎంగేజ్‌మెంట్ రేట్ ,  ఖాతాదారుడి విశ్వసనీయత వంటి ముఖ్యాంశాలను నిపుణుల బృందం సమగ్రంగా పరిశీలిస్తుంది. విశ్వసనీయమైన కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే ప్రభుత్వ సమాచార ప్రచార బాధ్యతలను అప్పగిస్తారు.   

ఈ నిర్ణయంతో సోషల్ మీడియా కేవలం వ్యక్తిగత వినోదానికి లేదా సాధారణ కంటెంట్ మేకింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ఒక అధికారిక ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థలో భాగస్వామిగా మారుతోంది. స్థానిక డిజిటల్ క్రియేటర్లకు, కంటెంట్ తయారీనే నమ్ముకున్న యువతకు ఇది ఒక మంచి ఆర్థిక ప్రోత్సాహకంగా నిలవడమే కాకుండా, వారి నైపుణ్యాలకు ప్రభుత్వ గుర్తింపు లభించినట్లవుతుందని ఐటీ సమాచార  నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

ప్రభుత్వ ప్రకటనలతో నేరుగా భాగస్వామ్యమయ్యేందుకు త్వరలోనే ప్రత్యేకమైన డిజిటల్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించేందుకు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ   ఏర్పాట్లు చేస్తోంది. తగినంత మంది ఫాలోవర్లు ఉండి, క్వాలిటీ కంటెంట్ రూపొందించే ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.                

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి.. 90.1 శాతం ఫిజికల్ ప్రోగ్రెస్.. వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
పోలవరం ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి.. 90.1 శాతం ఫిజికల్ ప్రోగ్రెస్
AP Elections: కుట్రలతో ఎన్నికలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం.. ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం- కూటమి పార్టీల ఉమ్మడి ప్రకటన
కుట్రలతో ఎన్నికలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం.. ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం- కూటమి పార్టీల ఉమ్మడి ప్రకటన
AP Local Elections: ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్ఈసీ సంచలన ప్రకటన.. అభ్యర్థుల తుది జాబితాపై ఉత్కంఠ!
ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్ఈసీ సంచలన ప్రకటన.. అభ్యర్థుల తుది జాబితాపై ఉత్కంఠ!
Advertisement

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget