అన్వేషించండి

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదే!

Andhrapradesh News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. జులై 1వ తేదీ నుంచి ఆయన 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ ఖరారైంది.

Deputy CM Pawan Kalyan Visit Kondagattu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు 3 రోజుల పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. తొలిరోజు గొల్లప్రోలులో పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. అనంతరం జులై 2వ తేదీన కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. జులై 3న ఉదయం ఉప్పాడ కొత్తపల్లి సముద్ర ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞతా సభలో ప్రసంగిస్తారు.

కొండగట్టు దర్శనం

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శనివారం సందర్శించారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో కాన్వాయ్ ఆపిన పవన్.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు భారీ గజమాలతో ఆయన్ను సత్కరించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పవన్‌కు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. పవన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు, అభిమానులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జన సందోహంగా మారింది. పవన్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  

Also Read: CM Chandrababu: 'మండుటెండలో మీ కష్టాలు చూసి చలించా' - పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ర్యాష్ డ్రైవింగ్‌లో ప్రాణాలు పోవడం సహజం - హత్య కేసు పెడతారా - అప్పలరాజు కొడుక్కి అండగా జగన్
ర్యాష్ డ్రైవింగ్‌లో ప్రాణాలు పోవడం సహజం - హత్య కేసు పెడతారా - అప్పలరాజు కొడుక్కి అండగా జగన్
Breaking News: ఏపీలో SIR గడువు పొడిగింపు.. మరో 10 రోజులు ఛాన్స్
ఏపీలో SIR గడువు పొడిగింపు.. మరో 10 రోజులు ఛాన్స్
NTR Office Statement: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం Raw NTR 'సంస్థకు లేదు - అఫీషియల్ స్టేట్మెంట్
'ఊరూ వాడ'తో పొలిటికల్ ఎంట్రీ, ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ ఆఫీస్
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ శోభ: దుర్గమ్మకు పట్టుచీరతో ఉత్సవాల ఆరంభం!
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ శోభ: దుర్గమ్మకు పట్టుచీరతో ఉత్సవాల ఆరంభం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
NTR Office Statement: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం Raw NTR 'సంస్థకు లేదు - అఫీషియల్ స్టేట్మెంట్
'ఊరూ వాడ'తో పొలిటికల్ ఎంట్రీ, ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ ఆఫీస్
Gun At Shopping Mall: కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
POCSO Act: టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Bhagyashri Borse : ఏంజెల్ భాగ్యశ్రీ - ట్రెడిషనల్ డ్రెస్ విత్ క్యూట్ లుక్
ఏంజెల్ భాగ్యశ్రీ - ట్రెడిషనల్ డ్రెస్ విత్ క్యూట్ లుక్
IND Predicted XI Vs Eng in 1st ODI: ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
Embed widget